పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

433 పన్నిన కాణాచి నీ పాదములందు గడించి యున్నవారు సనకాదియోగీంద్రవర్యులు చ. గొందినే బ్రహ్మపట్టము గోరి జపియించు మంటే నెందరు బ్రహ్మలు చని రింతక తొల్లి యిందు నందు నీ లోకమే యిరవుగా జపియించి అందిరి నీపదము ప్రపూదనారదాదులు చ. కాంతులు మించినయట్టి కాయసిద్ధి గోరే మంటే నెంత సృష్టి చనెనో యింతక తొల్లి చెంత శ్రీవేంకటేశ్వరు సేవాసిద్ధి యడిగి సంతోషమునఁ బొందిరి సర్వనిత్యముక్తులు రేకు: 0386-01 రామక్రియ సంపుటము: 04-498 పల్లవి: కంటిగంటి వీఁడివో కని కృతార్జుఁడనైతి వింటి నిందరిచేతా నీ విట్టలేశు సుద్దులు చ. యీతఁడా గోవర్ధనమెత్తిన పసిబాలుఁడు కాతరీఁ డీతఁడా గోపికా వల్లభుఁడు పూతన నీతఁడా పట్టి పొరిగొన్నయట్టివాఁడు చేత గచ్చకాయలాడీ శ్రీ విట్టలేశుఁడు చ. యీ దేవుఁడా కుచేలుని కిష్ట సంపదిచ్చినాఁడు పోదిగొని యీ దేవుఁడా భూభార మడఁచినాఁడు వేదమయుఁడీ దేవుఁడా విశ్వరూపు చూపినాఁడు సేదదేరీ మహిమల శ్రీ విట్టలేశుఁడు చ. యీ మూరితా పాండురంగ మిరవై వుండినవాఁడు కామించీ మూరితి శ్రీ వేంకటగిరి నున్నవాఁడు దోమటి నీమూరితే యాధ్యులుపాట మెచ్చినాఁడు క్షేమముతో వరాలిచ్చీ శ్రీ విట్టలేశుఁడు రేకు: 0387-01 లలిత సంపుటము: 04-504 పల్లవి: కంటిమి నేఁ డిదే గరుడా చలపతి యింటి వేలుపగు యీశ్వరుఁ డితఁడు చ. శ్రీ నరసింహుఁడు చిన్మయ కాంతుఁడు దానవాంత్రకుఁడు దయూని8) నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుఁ డితఁడు చ. దేవాది దేవుఁడు దినకర తేజుఁడు జీవాంత రంగుఁడు శ్రీ విభుఁడు దైవ శిఖామణి తలఁచినవారిని సేవలు గొని కాచే విభుఁడితఁడు చ. పరమమూర్తి హరి ప్రపదవరదుఁడు కరుణానిధి బుధ కల్పకము పరగు శ్రీ వేంకటపతి తన దాసులనరుదుగఁ గాచేయనంతుఁడితఁడు రేకు: 01:15-02 సాళంగనాట సంపుటము:02-086 పల్లవి: కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము గోరెంటలి రావణునందు గుహునియందు చ. నీదాస్యముగల నీచజన్మమైన మేలు యేదియు నెఱఁగనట్టి యొక్కువ జన్మానకంటే