పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

428 ఆసల బహుఫలము హరిదాస్యము త్రాసువంటిది కర్మము దైవముపై భక్తియైతే బాస దప్పక పండినపంటవంటిది . గడించినంతే ధనము కైకొనేటివారికెల్ల అడరి విజ్ఞానధన మక్షయం సుడివంటిది సంపద చుట్లఁ బెట్టుచునుండు అడఁచి నిరాశ బ్రహ్మనందమువంటిది . ధర నాడినంతే వట తగు నక్షరజ్ఞలకు హరినామోచ్చారణ మక్షయం యిరవై శ్రీ వేంకటేశుఁడిందుల కధిదేవత నిరతి నితనికృప నిధానమువంటిది రేకు:0233-05 లలిత సంపుటము: 03-190 పల్లవి: ఓపితేఁ దానే తగిలి వోపకున్నఁ దానే మాని మాపురేపు నలయించే మాయ మాకేలా చ. చింతాయకుఁడగు(?) హరి చిత్తములో నుండఁగాను వింతవింత విచారాల వెట్టి మాకేలా చెంతల పరుసవేది చేతిలోనే వుండఁగాను దొంతరవిద్యలతోడి దోవ మాకేలా . తోడునీడై యచ్యుతుఁడు తొలఁగక వుండఁగాను జాడ దప్పి తిరిగేటి జాలి మా కేలా యేడనో కోకలు వేసి యేమియు నెరఁగలేక వేడుకతో కొక్కెరాలవెంట మాకేలా . వెల్లవిరై యెదుట శ్రీవేంకటేశుఁ డుండఁగాను బల్లిదుఁ డీతనిఁ బాసి భ్రమ మాకేలా యెల్ల ధాన్యములు మా యింటిలో నుండఁగాను పొల్లి కట్టు దంచేమని బుద్ధి మాకేలా రేకు: 9117-05 రామక్రియ సంపుటము: 04-607 పల్లవి: ఓయమ్మ యెట్టు సేసె నొకటొకటే మాయలెల్లఁ జేసినాఁడు మరియింకనెట్లో చ. చన్నుదాగి పూతనను సగ్గుడుగాఁ జప్పరించె మిన్నుదాఁకె సుడిగాలి మెడ దొక్కెను