పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

429 వెన్న ముచ్చిరించి గొల్లవెలఁదులనెల్ల మెచ్చి పిన్ననాఁడె యింతసేసెఁ బెద్దయైన నెట్లో చ. మద్దిమాఁకులు విరిచె మామయింటికేఁగి పెద్ద యొద్దులఁ జీఁచమణఁచె నేమి వెప్పరు చద్దికూటి ముద్దలోనె జలజాసనుని మాయ వద్దనక పతిసేసె వాఁడివో నేడెట్లో చ. కొండవంటి పామునోరు కొచ్చి కొచ్చి చంపి చంపి మెండుకొని వుక్కణంచె మేనమామను కొండల వేంకటపత్రి కోనేటిరాయఁడు నిండు కృప మముఁ గాచేనేరుపిక నెట్లో రేకు: 0350-05 శోకవరాళి సంపుటము: 04-295 పల్లవి: ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో చ. జగములో రాముఁడై జనియించె విషుఁడదె అగపడి లక్షి సీతయై పుట్టెను తగు శేష చక్ర శంఖ దైవసాధనములెల్ల జిగి లక్ష్మణభరతాంచితశత్రుఘ్నులైరి చ. సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుఁడు మరిగిఁ రుద్రుఁడే హనుమంతుఁడాయను సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు వెరవరి నలుఁడే విశ్వకర్మ సుండి చ. కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాఁటిరి ముట్టిరి లంకానగరము నీదళము యిట్టె శ్రీవేంకటేశుఁడితఁడై రావణుఁ జంపె వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు రేకు:0082-04 రామక్రియ సంపుటము: 01-396 పల్లవి: ఓహో డేండేం వొగి బ్రహ్మమిదియని సాహసమున శృతి చాటెడిని చ. పరమును నపరముఁ బ్రకృతియు ననఁగా వెరవు దెలియుటే వివేకము పరము దేవుఁడును అపరము జీవుఁడు తిరమైన ప్రకృతియె దేహము చ. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును పూని తెలియుటే యోగము జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ జ్ఞాన గమ్యమే సాధించు మనసు చ. క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడని సరవిఁ దెలియుటే సాత్వికము క్షరము ప్రపంచ మక్షరము కూటసుఁడు సిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు రేకు:0297-05 శ్రీరాగం సంపుటము: 03-564 పల్లవి: ఓహో నిలిచిన దొకటిదియే శ్రీహరి సాకారచింతనము చ. పంచమవేదపు పద్మాక్షునామము అంచెఁ జూపపూర మ5°షధము