పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

427 చ. సులువునఁ గొన్నాళ్లకు నరులే సుర లౌదురు అల సురలే నరులౌదురు మీఁద జలమయమై యుండు జగమెల్లా నొకవేళ జలమందే భూమి పుట్టి జగము గాన్పించు చ. యీరీతి నొకానొకప్పు డేనుగు దోమయై పుట్టు ఆరయఁగా దోమ యేనుగై పుట్టును చేరి కాలగతులను చీఁకటి వెన్నెల నొత్తు పేరి వెన్నెల చీఁకటిఁ బెడఁబాయఁజేసును చ. పరగ భాగ్యవశాన బంట్లే దొర లౌదురు అరుదుగ దొరలే బంట్లాదురు మీఁద యిరవై శ్రీవేంకటేశుఁ డేలికని కొల్చితేను పరము నిహము నొక్కపగిది కలుగును రేకు:0234-05 దేసాళం సంపుటము: 03-196 పల్లవి: ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు గోడ గడుగ నడుసే కురిసీనో మనసా చ. చిత్తము లోపలనున్న చింతామణి యీహరి యిత్తలఁగోరినవెల్లా నియ్యఁగాను తత్తరించి తలఁచక దవ్వవోయి పరులకు దెత్తివై యేల నోళ్లు దెరిచేవో మనసా చ. కన్ను లెదుటనే హరి కల్పవృక్షమై యుండి మన్నించి లోకమెరఁగ మనుపఁగాను యెన్ని వలసిన మరి యీతనినే యడుగక కన్నవారి నేలడుగఁ గటకటా మనసా చ. శ్రీవేంకటేశుఁడే మనచేతి పరుసమై యుండి తావున నిహపరాలు తానియ్యఁగాను భావించి మొక్కక వేరే బదులైన జీవులను దావతిపడుచు నేల తగిలేవో మనసా రేకు: 9028-03 ఆహిరి సంపుటము: 04-546 పల్లవి: ఓపనయ్య వోపనయ్య వోపనయ్య యీ వొప్పలే తప్పులు చ. ఎక్కడికి నెక్కడ యొక్కువే యెరవు తక్కులే యీ మొక్కులు తక్కువే దారణ చ. ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు తప్పలే యీ రవ్వలు చివ్వలే సిగ్గులు చ. బొంకులే పొందులు కింకలే గిరులు వేంకటవిభుఁడ నీజంకెలే జంపులు రేకు: 9080–03 -- సంపుటము: 04-583 పల్లవి: ఓపనయ్య వోపనయ్య ఓపనయ్య యీ యొప్పలే తప్పలు చ. ఎక్కడికి నెక్కడ - యొక్కువే యెరవు తక్కులే యీ మొక్కులు - తక్కువే దారణ చ. ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు తవ్వలే యీరవ్వలు - చివ్వలే సిగ్గులు చ. బొంకులే పొందులు - క్రింకలే గిరులు వేంకటవిభుఁడ నీ – జంకెలే జంపులు పె.అ.రేకు: 0035-01 దేవగాంధారి సంపుటము: 15-195 పల్లవి: ఓపికగలవారికి వొడి నుండు నవి రెండు పై పైఁ జేకొనేటివారిభాగ్యము కొలఁదులు చ. సేసినంతపుణ్యము సృష్టిలోనివారి కెల్ల