పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

426 చ. నారాయణ నీనామము దలఁచిన - నీరానివరములిచ్చితివి చేరి నిన్ను నిటు సేవించిననిఁకఁ గోల పడయు నిఁకఁ గోలికలేవి చ. హరి నీకొకమరి యుటు శరణంటే గరిమల నన్నిటు గాచితివి నిరతముగా నిఁక నిను నుతియింపుచు అరగొరత్రనివి నిను నడిగేదేదో చ. శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన భావమే నీవై పరగితివి యీ వరుసల నీవింతటిదాతవు ఆవలనినుఁ గొనియాడెడిదేమి రేకు: 0307-05 దేవగాంధారి సంపుటము: 04-041 పల్లవి: ఒహో వొడలుమాని వోపికె గడుమేలు యిహల నీవుపకారమేమని నుతింతు చ. పుట్టినచోటంటినా అది భూతములనెలవు నెట్టన మూసిన మేను నిఖిల హేయమయము యిట్టి నా యాతుమలోన హరి యెట్టుంటివి నీవు అట్టె నీచేఁతలు దలఁచి అరుదయ్యి నాకు చ. మించుల మనసుంటిమా అది మిగులఁ జంచలంబు పంచల నా సంపదలు పాపపుణ్య విధులు యెంచగా యిటువంటి నన్ను యెట్టు ధరియించితి నించిన నీ చేఁతలు విని నివ్వెరగయిన్యాని చ. పాయ మిది యంటిమా పంచేంద్రియముల వశము ఆయము నా కంటిమా అది అయిదు భూతముల మొరఁగు యీయెడ శ్రీవేంకటేశ యీడా యెట్టేలితి నన్ను మాయల నీశరణంబిందుకే మనసయిన్యా నాకు రేకు:0356-01 శ్రీరాగం సంపుటము:04-327 పల్లవి: ఓ పవనాత్మజ వో ఘనుఁడ బాపుజూపనఁగఁ బరగిలిగా చ. వో హనుమంతుడ వుదయాచలని - ర్వాహక నిజసర్వ ప్రబల - దేహము మోఁచిన తెగువకు నిటువలె సాహసమిటువలెఁ జాటితిగా చ. వో రవిగ్రహణ వో దనుజాంతక మారులేక మతి మలసితిగా దారుణపువినతాతనయూదులు గారవింప నిటు గలిగిత్రిగా చ. వో దశముఖహర వో వేంకటపతి - పాదసరోరుహపాలకుఁడా యీ దేహముతో నిన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా పె.అ.రేకు : 0067-02 శుద్ధవసంతం సంపుటము: 15-383 పల్లవి: ఓడలు బండ్ల వచ్చు నొగి బండ్లోడ లెక్కు యేడా నహంకార మేల యెఱిఁగినవారికి