పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

425 చ. సేయరాని తప్పులెల్లాఁ జేసి పచ్చి నిన్నుఁ గొల్చి యేయోడా బలువుఁడనై యొసగితిని రాయడి నరకము చొఱక నీ మఱఁగు చొచ్చి తోయరాని వెల్లాఁ దోసి దొర నైతిని చ. వెడమాయ మరునికి వీఁగి వచ్చి నీకు మొక్కి కడు బిరుదుబంటనై గర్వించితి వడిఁ బుట్ట బతిమాలి వచ్చి నీ నామధారినై బడిఁ బాపముల గెలిచి పంతగాఁడ నైతిని చ. వొట్టిన కర్మములకు నోడి వచ్చి నీ వాఁడనై దిట్ట నీ దాసులఁ గూడి ధీరుఁడ నైతి యిట్టె శ్రీవేంకటేశ యేలితి విందే నన్ను నెట్టుకొని నిన్నుఁ బాడి నిర్మలుఁడ నైతిని రేకు: 0366-06 ముఖారి సంపుటము:04-392 పల్లవి: ఒలపక్షము లేనొక్క దేవుఁడవు నలినాక్ష హరీ నమో నమో చ. నేరిచిన నే నేరకుండిన నీ కారుణ్య మొక్కటే కలది పారి ఘంటాకర్ణుభక్తికి సరిగా చేరి శుకాదులఁ జేకొంటిగాన చ. సాదనైన నేఁ జలమతినైనా నీ పాదమొక్కటే నే బట్టినది పాదైన వసిషు భక్తికి సరిగా మేదిని వాల్మీకి మెచ్చితి గాన చ. యేమిటా శ్రీ వేంకటేశ యెంతైన నీ నామమొక్కటే నే నమ్మినది సామజము భక్తి సరిగా నీవును ప్రేమతోఁ బ్రహ్లాదుఁ బెంచితిగాన రేకు:0102-01 లలిత సంపుటము:02-007 పల్లవి: ఒల్లఁడు గాక దేహి వుద్యోగించఁడు గాక కొల్లలైన మేలు తనగుణములో నున్నది చ. తలఁచుకొంటేఁ జాలు దైవమేమి దవ్వా నిలుచుక తనలోనే నిండుకున్నాఁడు చలపట్టితేఁ జాలు సర్గమేమి బాఁతా చలివేఁడి నాలికపై సత్యములో నున్నాఁడు చ. ఆయమెఱిఁగితేఁ జాలు నాయుష్యము గరవా కాయపుటూపిరిలోనే గని వున్నది చేయఁబోతే పుణ్యుడుగా జీవునికిఁ దడవా చేయూరఁ గర్మము తనచేతిలోనే వున్నది చ. మొక్క నేరిచితేఁ జాలు మోక్షమేమి లేదో యొక్కువ శ్రీవేంకటేశుఁ డిదే వున్నాఁడు దక్కఁగొంటేఁ జాలు పెద్దతనమేమి యరుదా తక్కక శాంతముతోడి దయలోన నున్నది రేకు: 0354-05 సాళంగనాట సంపుటము:04-319 పల్లవి: ఒసఁగితివిన్నియు నొకమాఁటే వెస నిఁకఁ జేసే విన్నపమేది