పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

424 చ. కన్నుల నేఁ జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే విన్నవినుకులెల్లా విష్ణుఁడ నీకథలే తిన్నని నామాటలెల్లా త్రివిక్రమ నీమంత్రాలే అన్నిటా నాభావము సమర్పణము నీకును చ. అట్టె నే నడచేవెల్లా హరి నీప్రదక్షిణాలే గుట్టున నాసేఁతలెల్లా గోవింద నీకైంకర్యాలే ముట్టి నేభజించినవి ముకుంద నీప్రసాదాలే నెట్టన నాబోగమెల్లా నీవసము చేసితి చ. యిల నేఁ బండఁబడేవి యీశ్వర నీకు మొక్కులే తలఁచే నాతలఁపెల్లా దామోదర నీధ్యానమె నలువంక శ్రీవేంకటనాయక నీయనుజ్ఞను నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి రేకు:0025-01 దేసాక్షి సంపుటము: 01-149 పల్లవి: ఒప్పులై నొప్పులై వుండుఁగాన అప్పటప్పటికిఁ జూడ నదియేకా నిజము చ. కన్నుల కిన్నియుఁజూడ కలలై వలలై వున్నతాలు నడ్డాలై వుండుఁగాన చిన్న చిన్న చిటిపాటి చిమ్ముదొమ్ముదిమ్ములవి వున్నవన్నియుఁ జూడ నొకటేకా నిజము చ. సారేకు నోరికిఁ జూడ చవులై నవ్వులై పూరటమాటలై వుండుఁగాన తారుమారు తాఁకు సాఁకు తప్పుదోఁపు లిన్నియు వోరపారులేనివెల్ల వొక్కటెకా నిజము చ. మేనికి నిన్నియుఁ జూడ మృదువై పొదువై పూని సంపదలై వుండుఁగాన తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే వొక్క టేకా నిజము రేకు: 02:19-05 దేవగాంధారి సంపుటము: 03-106 పల్లవి: ఒరసి చూడఁగబోతే నొకటి నిజములేదు పొరల మేను ధరించి పొరలఁగఁ బట్టెను చ. పాతకములట కొన్ని బలుపుణ్యాలట కొన్ని యీతల స్వర్గనరకాలిచ్చేవట యేతుల నందుఁ గొన్నాళ్లు యిందుఁ గొన్నాళ్లు పోతరించి కాతరించి పొరలనే పట్టెను చ. పారెలఁతులట కొందరు పురుషులట కొందరు వెలుఁగును జీఁకట్లు విహారమట కలవలింతలు గోరింత ఘనసంసారము గోరెOత్ర పారిలసి జీవులు రెంటాఁ బొరలఁగఁ బట్టెను చ. వొక్కవంక జ్ఞానమట వొక్కవంకఁ గర్శమట మొక్కి ఇహపరాలకు మూలమిదట తక్కక శ్రీవేంకటేశుదాసులై గెలిచిరట పక్కట నిన్నాళ్లు రెంటాఁ బొరలఁగఁ బట్టెను పె.అ.రేకు:0053-02 కేదారగెళసంపుటము: 15-300 పల్లవి: ఒరుల కొప్పించరాదు వోపనంటే నప కీర్తి మరలక రక్షించుటే మగపాడి యిఁకను