పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

423 చ. హరి యని నుడిగి రెండక్షరాలఁ బాపేటి దురితాలు భూవిలోనఁ దొల్లె లేవు పురిగొని యందుమీఁద పొంచి విశ్వాసములేక పెరగఁగఁ బెరుగఁగ పెచ్చు రేఁగీఁగాని చ. మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి అతిపుణ్యాలిలమీద నన్ని గలవా కతగా నట్టె మహిమగానలేక వుండగాను బతిమాలఁగానే యింత బయలాయఁగాని చ. శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటియేవల వరాలు లెక్క నెంచవసమా భావించి తెలిసి చేపట్టెడి యరుదింత దైవము నా కియ్యఁగాను దక్కె నింతేకాని రేకు:0279-03 దేవగాంధారి సంపుటము: 03-455 పల్లవి: ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా చ. నాలికె వొక్కటే నీ నామము లనంతము పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు సాలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా చ. వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా గట్టి నా చెవులిసుమంత కథలు నీకవియెన్నో పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా చ. యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన కామించి నీడాగు మోచి గతిగ నేను యిూ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా రేకు:0223-01 సామంతం సంపుటము: 03-126 పల్లవి: ఒడఁబడఁ గదవో వో మనసా పెడరేఁచి యతఁడే పెనఁగీఁ గాక చ. అంతయుఁ జూచిన హరి సంకల్పమే చింతలు సిలుగులు జీవులవి బ్రాంతిపట్టి యిఁకఁ బదరఁగ నేఁటికి చెంత నతఁడు దయసేసీఁ గాక చ. ఘన విశ్వకుటుంబిని (?) కమలాక్షుఁడే జననమం (మా?త్రములే జంతులవి గొనకొని యిందుకుఁ గోలిక లేఁటికి వొనరించి యతఁడె వొసగీఁగాక చ. సిరు లందించఁగ శ్రీవేంకటేశుఁడు పరగు భోగములె ప్రాణులవి మరుగక యినామేలు మఱవఁగ నేఁటికి గరిమ నీతఁ డెపుడు గలిగీఁగాక రేకు: 0145-02 గౌళ సంపుటము: 02-201 పల్లవి: ఒడఁబరుచుకొంటివి వుపేంద్ర నిన్ను నిపుడె చిడిముడి నీసేవకే సెలవు చేసుకొమ్మీ