పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

422 చ. వొండె నాపద దీరితే నొండె సంపదైనా వచ్చు అండ నెన్నఁడుఁ దీరదు హరిఁ దలఁచ తండోపతండములై తలమోపులు పనులు చండిపెట్టి పనిగిరెను సంసారము చ. పాప మొల్లనంటేను బలుపుణ్యమై తగులు యేపొద్దుఁ దీరదు హరి నిటు దలఁచ వోపనన్నాఁ బోనీదు వూరకైనఁ బనిగొను చాపకింది నీరువలె సంసారము చ. పగలెల్లా నలసితే పైకొను రాతిరి నిద్ర అగపడ దెప్పుడును హరిఁ దలఁచ తగిలి శ్రీవేంకటాద్రి దైవమే పొడచూపఁగా జగడము సంత్రమూయు సంసారము రేకు: 0377-03 భైరవి సంపుటము:04-449 పల్లవి: ఒక్కటికొక టివి యోగములు యిక్కడ మాబుద్దు లెక్కడఁ గొలుపు చ. పాయపు మతిలో బలువగు నాసలు కాయము భువిలోఁ గలదాఁకా ఆయము సంసార మOదుకు మూలము యేయుపాములు యొక్కడఁ గొలుపు చ. మానదు కోపము మతి చెంచెలమును కాని కర్మమిది గలదాఁకా ఆనిన మనసే యందుకు మూలము యే నేరుపు లిఁక నెక్కడఁ గొలుపు చ. అందదు మోక్షం బవ్వల నివ్వలఁ గందువ నిను మత్రి గనుదా(కా అందితి శ్రీ వేంకటాధిప నీ కృప యొందలి మాయలు యొక్కడఁ గొలుపు రేకు: 0193-04 ధన్నాసి సంపుటము:02-477 పల్లవి: ఒక్కమనసున నే నుండేఁగాక యొక్కడిపనులు దానే యొఱఁగఁడా చ. బలుదేహ మిచ్చువాఁడు ప్రాణము వోసినవాఁడు తలఁపొసగినవాఁడు దైవమేకాఁడా వెలుపలి లంపటాలు వేవేలు గడించి తాను మలసి ఇంతలో నన్ను మఱచీనా చ. జగము లేలేటివాఁడు సంసారిఁ జేసినవాఁడు తగులై యుండినవాఁడు తానేకాఁడా బెగడకుండ దినాలు పెరుగఁజేసేటివాఁడు తగినట్టు నడపించఁ దా నేరఁడా చ. మొదలై యుండేటివాఁడు ముందరం దుదయ్యేవాఁడు యెదలోవాఁడు శ్రీవేంకటేశుఁడే కాఁడా చదివించి బుద్దులిచ్చి చైతన్యమైనవాఁడు పొదిగి నాదాపుదండై భోగించఁడా రేకు: 0336-04 పళవంజరం సంపుటము: 04-211 పల్లవి: ఒక్కమాఁటలోనివే వొగి బంధమోక్షాలు చిక్కినందాఁకా దేహి చింతఁ బొందీఁగాని