పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

421 చ. నానా దేవతలున్నారు నానా లోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి జ్ఞానికిఁ గామ్యకర్మాలు జరపి పొందేదేమి ఆనుకొన్న వేదోక్తాలైనానాయఁ గాక చ. వొక్కండు దప్పికి ద్రావు వొక్కడు కడవ నించు నొక్కఁ డీఁదులాడు మడుగొక్కటి యందే చక్క జ్ఞానియైనవాఁడు సారార్ధము వేదమందు తక్కక చేకొనుఁ గాక తలకెత్తుకొనునా ವಿ. ಯು.ಬಿ భగవద్గీతార్థమిది యర్జునునితోను యెదుటనే వుపదేశమిచ్చెఁ గృష్ణుఁడు వెదకి వినరో శ్రీవేంకటేశు దాసులాల బ్రదుకుఁ ద్రోవ మనకు పాటించి చేకొనరో రేకు: 0247-03 లలిత సంపుటము: 03-268 పల్లవి: ఒక్కఁడే యీ జీవుఁడు వొడలు మోపనినాఁడు యొక్కడి కెక్కడి మాయ యేమి గట్టుకొనెనో చ. పొంచి గర్భమున మాసు పొదిగి వుండిననాఁడు యెంచుకొని ముచ్చటాడ నెవ్వరున్నారు භුLණ්ෆC ඩර්ෆර්‍යL(?) కొనెయట్టి సంసారమిదియు అంచుమోచి తానెందు అణఁగుండెనో చ. నిచ్చనిచ్చ రాతిరులు నిదురవోయేవేళ యిచ్చలఁ దాఁ జేసే పనులేమున్నవి కచ్చపట్టి తన మేనఁ గాచుకున్నకర్మములు యొచ్చుకుందుల నాచోట నెందు వోయనో చ. బుద్దెరఁగక బాలుఁడై పొత్తులలోనున్నపుడు కొద్దిలేక తానెవ్వరి గురుతెరుఁగు అదుక శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి తిద్దుక రాఁగానే కాక తెలివెందు నున్నదో రేకు: 0379-04 పాడి సంపుటము:04-462 పల్లవి: ఒక్కఁడే యేకాంగవీరుఁ డుర్వికి దైవమానా యొక్కడా హనుమంతుని కెదురా లోకము చ. ముందట నేలేపట్టమునకు బ్రహ్మయినాఁడు అందరు దైత్యులఁ జంపి హరి పేరైనాఁడు అంది రుద్రవీర్యము దానై హరుఁడైనాఁడు యెందు నీ హనుమంతుని కెదురా లోకము చ. చుక్కలు మోవఁ బెరిగి సూర్యుఁడు దానైనాఁడు చిక్కుఁ బాతాళము దూరి శేషుఁడైనాఁడు గక్కన వాయుజుఁడై జగత్ర్పాణుఁడై నాఁడు యొక్కువ హనుమంతుని కెదురా లోకము చ. జలధిఁ బుటమెగసి చంద్రుఁడు దానైనాఁడు చెలఁగి మేరువుపొంత సింహమైనాఁడు బలిమి శ్రీ వేంకటేశు బంటై మంగాంబుధి - నిల యీ హనుమంతుని కెదురా లోకము రేకు:0220-04 గుండక్రియ సంపుటము: 03-111 పల్లవి: ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు చక్కదెరనాటకము సంగతి సంసారము