పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

419 నొడిగించు నాతఁడే నోరఁగొలఁది గడియించు నాతఁడే కడలేని సిరులెల్ల అడియాలమగులోని యంతర్యామి చ. మతి యిచ్చు నాతఁడే మరపించు నాతఁడే గతియా నాతఁడే కరుణానిధి వెతమాన్పు నాతఁడే వెలయించు నాతఁడే అతిశయమగులోని యంతర్యామి చ. యిహమిచ్చు నాతఁడే యెదురెదురనే వచ్చి సహజపుఁ బరమిచ్చు సరి నాతఁడే విహగ గమనుఁడు శ్రీ వేంకటేశుఁ డితఁడే అహరహమాదరించు నంతర్యామి రేకు:0258-03 దేసాక్షి సంపుటము: 03-333 పల్లవి: ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము యొక్కువ నాతని నెరఁగవో మనసా చ. వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు పట్టిన విప్టులు బ్రహ్మలమందురు నట్టనడుమవారే నవబ్రహ్మలు జట్టిగ బ్రహ్మల సంతాయ జగము చ. కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు తాలిమి నేకాదశరుద్రులు మరి కాలరుద్రుఁడును కడపట నదివో చాలిన రుద్రుల సంతాయ జగము చ. అవతారంబున నలరిన విష్ణువు అవలవిష్ణుమయమనియెడి విష్ణువు భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదే జవళి వరంబుల సంతాయ జగము రేకు: 9066-02 శ్రీరాగం సంపుటము: 04-572 పల్లవి: ఒక్కఁడవె లోకానకొడయడఁవు నీవె దిక్కుగా నెవ్వరులేరు తిమ్మినాయఁడా చ. బొడుచెర్ల బొమ్మిరెడ్డి పొలమెల్లఁ జేడవెట్టి గడ్డనుండి పైరువిత్తి కాచుకుండఁగా దొడ్డగాఁ బండఁగఁ జూచి దోసకారి మొండిదొర దిడ్డిఁదీసి కొంటఁబోయ తిమ్మినాయఁడా చ. పాలకొల్ని చందిరెడ్డి పంటసేయఁ బొద్దులేక గాలివీటి కాపు(రానఁ గసుగందఁగా కోలుపుచు దినమూ నీకొండమీఁది నాయకులు తీలుపరచేరుగదే తిమ్మినాయఁడా చ. కామకొల్ని మారిరెడ్డి కనుచూపువారినెల్ల కోమలపు చెలుపలు గోరు మొత్తంగా ప్రేమముతోఁ గేదారి పెరిగి పండిన పంట తేమ రేఁగి ఊటువట్టె తిమ్మినాయఁడా చ. గుండుఁగంటి దేవిరెడ్డి కొలిచిన వండిపెట్టు కుండC గా పులింటనిOట కూడుమోయుఁగా పండిన బండ్లగొట్టి పంటలెల్ల నానాఁటి తిండికొక్క కొలఁదాయ తిమ్మినాయఁడా