పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

418 పనికిరావు అవి ప్రకృతి గాన ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే తనుఁ గానరాదు జీవతత్వము గాన చ. దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు భావించి మఱవవలె బంధాలు గాన కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన చ. సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు అరయ స్వర్గము తెరు వల మోక్షానకు పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని శరణాగతియె సర్వసాధనము గాన రేకు:0229-01 దేవగాంధారి సంపుటము: 03-162 పల్లవి: ఒకరికొకరు వొడ్డు దప్పులనే పకపక నవ్వు పచరించేరు చ. కొట్టీ నుట్లదే గోవిందుఁ డంతలో తిట్టేరు గోపసతీమణులు పట్టీ జన్నులట్టే పైపై గోవిందుఁడు మెట్టెల పాదాల మెట్టే రింతులు చ. వారవట్టీఁ బాలు వంచి గోవిందుఁడు గోర గీరే రదే గొల్లెతలు చీర లంటీనట్టె చెంది గోవిందుఁడు మేరతోఁ గొప్ప వంచి మించే రింతులు చ. కెలసి వెన్నారగించీ గోవిందుఁడు తొలఁగఁ దోసేరు దొడ్డవారు కలసెను శ్రీవేంకటాద్రి గోవిందుఁడు అలమేరు మరి నంగనలు రేకు:0292-05 సాళంగనాట సంపుటము: 03-534 పల్లవి: ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు సకలము హలియని సరిఁదోఁచీని చ. అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే జంతువులన్నియు సమములే బంతులఁ బాత్రాపాత్రము వెదకిన అంతట హరి దాస్యమేపో ఘనము చ. జగమును నొకటే చైతన్య మొకటే తగిన పంచభూతము లొకటే నగుతా నెదిరిని నన్నును నెంచిన మొగి నాపై హరి ముద్రలె ఘనము చ. కారు స్వతంత్రులు కడపట నొకరును యిూరీతి నౌఁగాము లిఁక నేలా శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే కారణము శరణాగతియే ఘనము రేకు: 0366-04 సామంతం సంపుటము: 04-390 పల్లవి: ఒకరిబుద్దులు వేరొకరి పనికిరావు అకలంకుఁ డింతటికి నంతర్యామి చ. పొడమించు నాతఁడే పొదలించు నాతఁడే