పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

417 మగిడి లొకముచింత మఱి యేల సగము విత్తులకును సగము పాకమునకు తగునా వొక్కటె కాయ తరిగిపెట్టినను చ. నలువంక దైవము నమ్మిన యట్టివారికి మలయ మనుష్యబుద్ధి మరి యేలా తులఁదూఁగు నొసలు బత్తుఁడు నోరు దోఁడేలు మెలఁగిన యట్టయితే మెచ్చునా దేవుఁడు చ. తక్కక శ్రీవేంకటేశు దాసానుదాఁసుఁడైతే మక్కువ నవుఁగాములు మఱి యేలా దిక్కుల యేనుగు నెక్కి దిడ్డి దూరఁ బోతేను వెక్కసమాఁ గాక యిది వినసంగతి యానా పె.అ.రేకు:0048-04 గుజ్జరి సంపుటము: 15-272 పల్లవి: ఒకటి కొకటి లంకెయి వుండు నర్ధముల కెల్ల సకలమున కితరసంగమే కారణము చ. కోరు నేదైనా తనకు కొసరుచు నీ మనసు కోరినది రాకుండితే కోపము వుట్టు ఆరయఁ గోపమువల్ల నజ్ఞానము ముంచుకొను పోరచి నజ్ఞానమునఁ బూర్వ మెల్లా మఱచు చ. చూచు నేదియైనాను సారిదిఁ గన్నులెదుట చూచినంతటిలోనే సుడిఁబెట్టు నాసలు యేచిన యాసలవల్ల యేమియైనా వేఁడఁజూచు యాచకము కడు దైన్య మందఁజేయు నపుడు చ. సేసు నూర కేమియైనా చెలరేఁగి కర్మములు సేసిన యాకర్మములు చేరి జన్మము నెత్తించు వేసారక జన్మము శ్రీవేంకటేశుఁ గొలిపించు రాసి కెక్క నితఁడే రక్షించు జీవుని రేకు:0171-03 గుజ్జరి సంపుటము:02-346 పల్లవి: ఒకటి కొకటి లంకై వూరకైనాఁ బెనగొను అకటా యెవ్వరు దాఁటేరయ్య నీమాయలు చ. తనయెదుటివెల్లాను తలఁపులోఁ బారును మనసులోపలివెల్లా మర్మము లంటు ఘనమర్మములు రేఁగి కాయమెల్లాఁ గరఁగించు తనువుసాఖ్య మవ్వలి తనువున నంటును చ. అవ్వలిదేహభోగము లట్టే కర్మములౌను మువ్వంకఁ గర్మాలు లోకములై చెందును చివ్వన నాలోకములు చేరి కాలము గడపు తెవ్వనికాలము నిద్రాఁ దెలివినై ముంచును చ. వెస నాతెలివి యొకవేళ నిన్నెఱిఁగించు వసమై ఆయెఱుకకు వచ్చి మెత్తువు యొసగి నీవు మెచ్చితే యిహపరము లిత్తువు మిసిమి శ్రీవేంకటేశ మెరయు నీయీవి రేకు:0173-02 ధన్నాసి సంపుటము: 02-357 పల్లవి: ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు చ. తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు