పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

413 దండములెట్ట నోపక దగ్గరి రాను చండి పోరి ముదిమి మాన్పఁగ వలెనని కాదు దండము వెట్టని నా తప్ప సహించుకోవే చ. నిలుచుండ సత్వలేక నేరమి వచ్చునో యని కొలువు సేయక మఱఁగున నుంటిని చలపట్టి నిన్ను నిట్టి సత్వ యిమ్మని కాదు కొలువని నేరమి కెగులుగాఁ బట్టకువే చ. పాట రంజకములేక పక్కన నవ్వేవో యని మాటలనే పొగడిత్రి మాపటిదాఁకా నీటున శ్రీవేంకటేశ నే వేసరించుట గాదు పాటించి పాడని నా యపరాధ మెంచకువే రేకు: 0355-05 వరాళి సంపుటము:04-325 పల్లవి: ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని పాలుపడిన యీ జలభ్రమణమువలెను చ. ధరలోఁ బుట్టినప్పుడే తలఁచ నీ యాత్మ మరుగఁడు పరమైతే మరచీఁగాని అరిది దుర్భాషల నలవడ్డనాలికె పూలినామములయుOదు నలవడదు చ. జవకట్టి పూర్వవాసనల సంసారమే చవియే తాఁగాని ముక్తి చవిగాదు భువిఁగల విషయాలఁ బుంగుడయిన్యాఁగాని మతి వివరించి దైవమును వెదకలేదు చ. శ్రీవేంకటేశుకృపచేత నింతేకాని వావాత నివి గైవశము గావు భావమిప్పడితని పాదాలు చేరికాని యేవుపమలనుఁ గాన మిన్నాళ్లును రేకు: 01:15-05 ముఖారి సంపుటము:02-089 పల్లవి: ఏలోకమందున్నా నేమి లేదు తాలిమి నందుకుఁదగ్గ దావతే కాని చ. సురల కసురలకు సూడునుఁ బాడునే కాని పొరసి సుఖించఁగఁ బొద్దు లేదు ధరలో ఋషులకు తపము సేయనే కాని మరిగి భోగించఁగ మరి పొద్దు లేదు చ. గక్కన సిద్దులకైనా గంతయు బొంతయే కాని చిక్కి పరుసము గలిగి సెలవు లేదు రెక్కలుగల పక్షికి రేసుతిమ్మటలే కాని చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు చ. సకల జంతువులకు జన్మాదులే కాని అకటా నిత్యానంద మందలేదు వెకలి శ్రీవేంకటేశువిష్ణుదాసులకే మంచిసుకములెల్లాఁ గలవు సుడివడలేదు రేకు:0001-04 సామంతం సంపుటము: 01-004 పల్లవి: ఏవం శ్రుతిమత మిదమేవ త ద్భావయితు మతఃపరం నాస్తి చ. అతుల జన్మభోగాసక్తానాం