పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

412 కొలువులు సేయించుకొనరాదా కలఁచెడి లోలోని కామాదిశత్రువుల బెళకనీకడ్డపెట్టింపించరాదా జీవుఁడ చ. అట్టే పరువుదోలిన ఆసలనే గుఱ్ఱముల గట్టిగ లోలాయమునఁ గట్టుకోరాదా వొట్టి యెదుట పౌఁజులై వుండిన భోగములను ముట్టి యంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుఁడ చ. పంపువెట్టి దండంపిన బలు నీ వుద్యోగాల గుంప గూర్చి ముక్తి చూరగొనరాదా ఇంపుల శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త సొంపుగ భావించి చక్కఁజూడరాదా జీవుఁడ చి.ఆ.రేకు:0006-04 దేసాళం సంపుటము: 10-034 పల్లవి: ఏలికెవై నన్నొకని నేలఁగాను నీ లీలావిభూతి కొకలేశము దక్కువా చ. పనివూని నాయొకనిపాపము మానుపఁగా నీ ఘనసంకల్పమునకుఁ గడమా చెనకి నేనె పూజ సేయఁగా మెచ్చేనంటె కనుకొనే వందేమి కండ గట్టుకొంటివో చ. దేవుఁడవై నామనసు దెరిచి రక్షించఁగాను గోవింద నీమాయ కేమి గొఱతా సాశీవల నాలోని భక్తి చూచి కాచే నంటివా కావలసి నీ వెంత్ర గాదెం బోసుకొంటివో చ. అలరి నాహృదయమునందుఁ గానుపించితేను వెలయ నీమహిమకు వెలితా కలిమితో నన్ను శ్రీవెంకటనాథ కూడితివి యిలమీఁద నీకు నిప్పు డెంతకీర్తి గూడెనో పె.అ.రేకు:0006-02 సౌరాష్ట్రం సంపుటము: 15-033 పల్లవి: ఏలిన వారికిఁ బోదు యీడేరించఁ దమసామ్మ కాలకాసు సేయకున్న ఘనముగాఁ జేతురు చ. పసు లే మెఱుఁగఁగా పట్టి కట్టి మేపు మేసి దెసలఁ బనులు సేయ దిద్దుకొందురు వసుధ నన్నటు వంటి వానిఁ దెచ్చి మీ సేవకు నెసఁగ మెదిపి కావు యేమి నే నెఱుఁగ చ. బిడ్డ లేమి యియ్యఁగాను ప్రేమముతోఁ గన్నతల్లి వెడువెట్టి చన్నిచ్చి వెసఁ బెంచును యెడ్డనైనా నే నీకు యెందునుఁ గొర క్రాకున్న వొడ్డిన జ్ఞాన మొసంగి వూరడించి కావవే చ. బానిలే దొడ్డు గాన పరులు దడవితేను దానికై వహించుకొని తాము వత్తురు నేను నీ దాసుఁడ నింతే నెమ్మది శ్రీ వేంకటేశ పూనుకొని వచ్చి నన్నెపడు గావవే పె.అ.రేకు:0056-02 సాళంగనాట సంపుటము: 15-320 పల్లవి: ఏలినవాఁడవు గన యెప్పుడు రక్షించేవే వేళతోఁ గొలువని వెల్లా లెస నోర్చుకొనవే చ. అండ నూరకే ముదిసి యపచార మానో యని