పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

411 తిరుగలేక యేల తినుకవలె యెరవులవిషయాల నేల పొరలవలె కొరగాని పాపాలగొడ వేలవలెను చ. మిగుల వురులలోన మెడ యాల పెట్టవలె తగిలించుకొని యేల పాగులవలె యెగసక్కెపుఁగోరిక లేల కోరవలె జిగురువంటిబందాలఁ జిక్క నేలవలెను చ. పారేబండికింద పాద మేల చాఁచవలె జారుపడి మరియూల జడియవలె మీరి శ్రీవెంకటనాథు మిక్కిలివేడుకఁ గొల్చి పోరుమాలివుండ కేల పొడిఁబడవలెను రేకు: 0335-02 నారాయణి సంపుటము: 04-203 పల్లవి: ఏలికవు నీవట యింకా దైన్యమేల తాలిమి నీచేఁతలకుఁ దగవు గాదనరా చ. ఘనకర్మానుభవమే కావలె నొండె నాకు వనజాక్ష నీసేవే వలె నొండె కినుకఁ బూఁటయు సంకెలయు రెండు నేల ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మీ చ. పైకొని నేఁ జేసినపాపమె కావలె నొండె తూకొని నీనామముచేఁ దుంచుట యొుండె సాకిరి చంకదుడు శరణార్తి రెండు నేల మేకొని యీవట వింటే మెత్తురా నిన్నును చ. యిరవుగా మరపారెండె యెరుక గావలె నొండె సరస రెండును నైన సంగతెనా గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను సరిబేసి జంటమాట జరపకు మిఁకను రేకు:0391-06 గుజ్జరి సంపుటము:04-531 పల్లవి: ఏలికె చెప్పినపని కెదురాడేనా నీలీల లివియని నిండుకుండే నేను చ. నీవు నాలోనున్నాఁడవు నే నున్నాఁడ సముఖాన కావరపుటింద్రియాలు కాకు సేసీని దేవర నీయప్పణో తెలియనానతీ నాకు ఆవిధమైతేనే అపరాధము లేదు చ. జగదీశుడవు నీవు శరణాగతుఁడ నేను జిగిఁ గామ క్రోధాలేల చిమ్మిరేఁచీని నగుతా నప్పగించేవో నాకది గాదన రాదు తగునిట్టానే యైతే తప్పలేదు మాకును చ. పుట్టించేవాఁడవు నీవు పుట్టుగులు నాసామ్మ చుట్టి సుఖదుఃఖా లేల సూడువట్టీని నెట్టన శ్రీవేంకటేశ నీనటనో మంచిదాయ యిట్టయితే మావంక నిఁక నేరమి లేదు రేకు:0238-02 రామక్రియ సంపుటము: 03-217 పల్లవి: ఏలికె విందరికి యీ దేహభూమి నీది మేలు అన్ని మట్టుపెట్టి మించరాదా జీవుఁడ చ. వెలిఁబడ్డ యింద్రియాల వెలయ లోనికిఁ బిల్చి