పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

404 తిన్ననై బత్తెము గొని దీపన మొక్కొక్కవేళ వన్నెకెక్కిన యప్పల వాఁడుఁ దాఁ గాఁడు చ. ముంచుకొను మోహము మొనసి యొక్కొక్కవేళ పారిOచి ముOదు వెనకల ముంచుఁ గాదు యెంచఁగ శ్రీవేంకటేశ యిందరికి దిక్కు నీవే నించితి నీ కృప అది నీ కడ్డము గాదు పె.అ.రేకు:0004-05 శుద్ధవసంతం సంపుటము: 15-024 పల్లవి: ఏమీ నడుగ నొల్ల నెచ్చుకొందు లన నొల్ల కామించి నీ విచ్చితి కైవల్యపదము చ. పుట్టుగులకు వెరవ భూమిలోన హరి నీకు అట్టె నీ దాసుఁడ నేనైతేఁ జాలు వెట్టికి నేజాతినైనా వెరవ నీనామములు వొట్టి నా నాలికమీఁద నుండితేఁ జాలు చ. వెఱవఁ బాపములకు వేయెనా హరి నీ యఱలేని కైంకర్యమిచ్చితేఁ జాలు వెఱవ నింద్రియముల వెతలకు నీ వాత్మ నుఱక బోధనుండవై వుండితేఁ జాలు చ. ఏ లోకమైన వెరవ యొక్కు శ్రీ వేంకటేశ పాలించి నీకృప నాపఁ బారితేఁ జాలు కాల మెట్జెన వెరవ కర్మ మెట్లేన వెరవ యేలిన నీదాలు నన్నియ్యకొంటేఁ జాలు రేకు:0083-05 బౌళి సంపుటము: 01-403 పల్లవి: ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్ల కామించి నీవిచ్చితివి కైవల్యపదము చ. పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు_ నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలు వెట్టికి నే జాతియైన వెఱవ నీనామములు వొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు చ. దురితాలకు వెఱవఁ దుద వేయెనా హరి నీ_ కరుణఁగైంకర్యము గలిగితేఁ జాలు నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు చ. యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ పాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలు కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ యేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జాలును రేకు:0047-01 ముఖారి సంపుటము: 01-286 పల్లవి: ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము తామసుండఁజుమ్మీ ముందరునున్నదైవమా చ. పాతకపుఁజేతులనే పట్టి నిన్నుఁ బూజించు ఘూఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యము చేతనముఁ బోదిసేయుచిత్తము నీదేకాన రాతిబొమ్మఁజుమ్మీ భారము నీది దైవమా చ. వూనినయెంగిలినోర నొప్పగునిన్నుఁబొగడు హీనజంతువునకు నా కేఁటిపుణ్యము