పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

402 పూఁపల నవ్వుల తోడి పాలఁతులఁ జూచిచూచి పూఁపలుఁ బిందెలు నై పొల్లువోయఁ దపము చ. కూటమి సతులపారెందు కోరి కోలి కూడికూడి కూటువ నావిర తెందో కొల్లఁబోయను నీటున శ్రీవేంకటేశ నినుఁగని యింతలోనె జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి రేకు:0118-03 బైరవి సంపుటము: 02-105 పల్లవి: ఏమి సేతు దైవమా యెన్నఁడు గరుణించేవో దామెన సంసారములోఁ దట్టువడీ మనసు చ. యొక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి చక్కుముక్కు సేసి యెంచి సాధించీని గుక్కక యేమిసేసిన కొలంయొకో వెంటవెంట వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని చ. యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని చ. యే వేళ గుణమో యెడతెగని కర్మాలు రావిమాని జిగురై వూరక యంటీని శ్రీవేంకటేశుఁడ నీవు చిత్తములోపల నుండి కావఁగఁగదా నీవే గతి యనవలసె రేకు:0238-01 కన్నడగౌళ సంపుటము: 03-216 పల్లవి: ఏమి సేతు నాభాగ్య మిట్లున్నది నేమమేమీ నెరఁగను నీవే గతి యిఁకను చ. అగపడి నిరంతర మలవాటైన జగత్తు మొగమునఁ గట్టినట్టు మొగి మరవనీదు తగిలి నిన్నెటువలె ధ్యానము సేతు నేను అగడు సేసి సహాయముగాదు మనసు చ. విడువక యెల్లప్పుడూ విడిదలైన దేహము మెడఁగట్టినట్టున్నది మెలఁగీ నురులదు వొడయఁడ నీవూడిగె మొదిగి నేనెట్టు సేతు అడరి కప్పిన నీ మాయాఁ దోడుగాదు చ. వొద్దనే పెక్కుగాలము పూనిన పురాకృతము చద్దిమూఁటైయనుభవించఁగఁ జేసీ మానదు అదుక శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు వొద్దికతో రక్షించు నావోజాఁ దోడుగాదు రేకు:0363–06 గుజ్జరి సంపుటము:04-374 పల్లవి: ఏమి సేయవచ్చు హరియెలయించే మాయ లివి వేమరు నాతనిఁ గొల్చివీడుకొంటగాక చ. పాయమే పరవైతేఁ బట్టఁగ నెట్లవచ్చు రోయుదాఁకా నందులోఁ బిరుగుటగాక కాయపువోడ తప్పుగాలి విసరినవేళ పోయినట్టే పోనిచ్చి పొనుఁగుటగాక చ. మనసే మలినమైతే మఱుఁగెట్టు సేయవచ్చు వొనర విరతిదాఁక నోర్చుటగాక