పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

401 దలఁకకిటు వేంకటేశుదాఁడౌట గాక రేకు:0088-02 గుండక్రియ సంపుటము: 01-430 పల్లవి: ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము దీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము చ. పాపచింత మదిలోన బారకుండా నిలిపితే చేపట్టి దానములెల్లా జేసినంత ఫలము కోపానలములోన కోరికలు వేల్చితేనే యేపున యజ్ఞాలు సేసి యేచినంత ఫలము చ. కనకముపై కాదని పోదొబ్బితేనే తనకు వేవేలు ఘనోరతపముల ఫలము వనితలమోహములవలఁ బడకుండితేనే దినము గోటితీర్ధాలు దిరిగిన ఫలము చ. శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే ధావతిలేని యట్టితనజన్మ ఫలము భావించి యాచార్యపాదపద్మమూలమే సావధానమున సర్వశాస్తార్థఫలము రేకు:0028–04 బౌళి సంపుటము: 01-172 పల్లవి: ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే యేమరిక కొలిచిన నీతఁడే దైవము చ. ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చు పనిసేయఁ జేతులిచ్చు బలియుఁడై తనుఁగొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించి వొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము చ. మచ్చిక తనుఁగొలువ మనసిచ్చు మాటలిచ్చు కుచ్చితములేని కొడుకుల నిచ్చును చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు నిచ్చలు లోకానకెల్ల నిజమైనదైవము చ. పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు యెంతటి పదవులైన నిట్టె యిచ్చు వింతవింత విభవాల వేంకటేశుఁడిదె మాయంతరంగముననుండే అరచేతిదైవము రేకు:0083-03 కాంబోది సంపుటము: 01-401 పల్లవి: ఏమి సేతు దేవదేవ యింతయును నీమాయ కామినులC జూచిచూచి కామిOచె భవము చ. చంచలపుఁగనుదోయి సతులబారికిఁ జిక్కి చంచల మందెను నాదిచ్చరి మనసు కంచుఁ గుత్తికలవారి గానములఁ జొక్కి చొక్కి కంచుఁబెంచు నాయఁబో నాకడలేని గుణము చ. తీపులమాటల మించి తెఱవలభ్రమఁ దరి తీపుల పాలాయఁబో నాతెలివెల్లాను