పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

400 పెరిగి తగులములై పెనఁపులఁ బెట్టును చ. వుపకారి దానధర్మా లొడఁ బాట్లే మించి విపరీతమై బలసి వేసరింపించు యెపుడు శ్రీవేంకటేశ యివి యెల్లా నీ చేష్టలు వుపమించి తెలిసితే వొద్దికతో నుందును పె.అ.రేకు: 0034-06 శ్రీరాగం సంపుటము: 15-194 పల్లవి: ఏమిటివాఁడ నేను యిందులోను దైవమా కామించి నీ మాయ లింతే కానవచ్చీ నాకు చ. సాలీఁడనే పురువు జటరముపొంగువలె చాలుకొని వచ్చీని సంసారబంధము కాలము కొలఁది వచ్చి గ్రహచక్రమువలె పాలుపడి జన్మములు బడీఁ దిరిగి చ. పొరి నడవిమృగము పుట్టుతానే చన్నుదాగే స్మరణవలెనే నా విషయభోగాలు పరగ నీరు వందడి పారే నీరువలె సిరుల వెంటఁ బారీ నా చిత్తవికారాలు చ. మొదల నీచేత లివి మోచు టెంతే కాక పదలి త్రలCచరాదు పలుకరాదు పారిదిటి శ్రీ వేంకటేశ పూఁచి నీకే శరణని యెదుట నున్నాఁడ నింతే యింకా నీచిత్తము రేకు: 0379-03 లలిత సంపుటము: 04-461 పల్లవి: ఏమిటివాఁడఁగాను యిఁకనేను నా - సామపుఁ గర్మము నీకే సమర్పయామి చ. తలఁపులోపలనున్న తత్వము యిట్టె వెలినుండే నాపాలి విష్ణుమూర్తీ పలుకు లోపల నుండే పరమాత్ముఁడా నా చలమరి మతి నీకే సమర్పయామి చ. పుట్టుగులిచ్చినయట్టి పురుషోత్తమా తుద - ముట్టించు మోక్షపుమురమర్దనా గుట్టుతో నిహముచూపే గోవిందుఁడా నా జట్టి చైతన్యము నీకే సమర్పయామి చ. అరిది భోగములిచ్చేయంతరాత్ముఁడా నాకు శరణమైనయట్టి సర్వేశ్వరా ! వెరసి నన్నేలిన శ్రీ వేంకటేశుఁడా నా సరవులన్నియు నీకే సమర్పయామి రేకు: 0038-06 దేవగాంధారి సంపుటము: 01-236 పల్లవి: ఏమిఫలము దానిన్నియునుఁ దెలిసినను సామనేసిన ఫలము జయశీలుఁడౌట గాక చ. తానుగలిగిన ఫలము దయ సేయఁగలుగుట మేనుగలిగిన ఫలము మేలెల్ల గనుట మూనుషముగల ఫలము మంచివా(డౌట త్రను( దానె తెలిసినఫలము తత్వపరుఁడౌట గాక చ. పదిలమగు కులము గల ఫలము తాఁజదువుట చదివినఘలO బర్థసారంబు గనుట పొదలి శాస్త్రర్ధంబు పొడగన్న ఫలము మతి