పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

399 సుకరపు ధనకాంక్ష సుజ్ఞానరహితము చ. తనువు పోషించనంటే తగులు నింద్రియములు ఘనవిరక్తుఁడైతే లోకము మెచ్చదు మనసు గెలిచేనంటే మర్మము శ్రీవేంకటేశుఁ డొనర వివేకించక వుడుగుదు మదము పె.అ.రేకు:0018-03 దేశాక్షి సంపుటము: 15-101 పల్లవి: ఏమిటికి వట్టి చింత యొక్కడివి దుఃఖములు శ్రీమంతుఁడే మా యరచేత నున్నాఁడు చ. సకలలోకేశ్వరుఁడు సర్వాంతరాత్మతుఁడు అకలఁకుఁ డిదివో మా యందు నున్నాఁడు ప్రకటించి యోలికయై బహు సంపదలై మొకరిబంధువుఁడై ముందర నున్నాఁడు చ. పరమపురుషుడు భవరోగవైద్యుఁడు యిరవైన దేవుఁడు మా యింట నున్నాఁడు పొరుగు పాశిరచి భువనరక్షకుఁడై దరిచేర్చి రక్షించ మాదండ నున్నాఁడు చ. శ్రీ వేంకటేశుఁడే శ్రీ మహాలక్షీయై కైవసపు సుఖమునై కల్గి యున్నాఁడు వేవేలు సుజ్ఞానములై వింత వింత వేడుకలై దేవుఁడై మాపాలిటఁ దిరమై యున్నాఁడు రేకు: 0338-03 బౌళి సంపుటము:04-222 పల్లవి: ఏమిటికిఁక నితరపుణ్యములు తాము దామె హరి దాసుఁడ నేను చ. దురితములు హరి తొల్లే తను శరణన్నపుడె చాలించినాఁడు నరకములు మరినాఁడే తిరుమంత్రముచేఁ దీరిచినాఁడు చ. పుట్టుగులు హరి భువి మునుపే గట్టిముద్రలనే కడపినవాఁడు నట్టుకొను అజ్ఞానము వెనకకే పట్టి గురునిచేఁ బాపినవాఁడు చ. యిహపరము లివియును నపుడే సహజధర్మమున జరపినవాఁడు విహితముగా శ్రీవేంకటపతి నను బహుదాసులలోఁ బాలించినాఁడు పె.అ.రేకు:0074-04 పాడి సంపుటము: 15-426 పల్లవి: ఏమిటివంకసుఖము యెంచి చెప్పఁగా వచ్చు కామించక మానుటే అక్షయసుఖము గాకా చ. వెలలేని పదార్థాలు వేడుకవలెనే వచ్చు చెలఁగి నాశమునొంది చింత్ర వుట్టించు పలు లంపటము లెల్లా పనికివచ్చినట్టుండి తలఁచినట్టు వడక తడఁబాటు సేసును చ. సరి నాహారనిద్రలు సహజమువలె నుండి అరుదై వేళలఁ దప్పి యలయించును పరుల సంగాతములు భక్తితోనే వొనగూడి