పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

398 అరయం బేదలకైన ఆపద మానుతురు చ. పలుజన్మములే నన్ను పరి అరికట్టుకోఁగా తొలగదోసి నాకు దోడైతివి యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు బలుభయ విుందరికిఁ బాపుచుందురు రేకు: 0109-03 మలహరి సంపుటము: 02-051 పల్లవి: ఏమి సేసే మిఁక నేము యెంతని దాఁచుకొందుము నీమహిమ యింతంతననేరము నేమయ్యా చ. అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే పొందిన పాతకమెలాఁ బొలిసిపోయ మందలించి మఱి యొకమాటు నుడిగిన ఫలమందు నీ కప్పగించితి మదిగోవయ్యా చ. యిట్టె మీకు రెండుచెతులెత్తాకమాటు మొక్కితే గట్టిగా నిహపరాలు గలిగె మాకు దట్టముగ సాష్టాంగదండము వెట్టిన ఫలమట్టె నీమీఁద నున్నది అదిగోవయ్యా చ. సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున సిరులఁ బుణ్యుడనైతి శ్రీవేంకటేశ ధరలోన నే నీకు దాసుఁడనైన ఫలమరయ నీమీఁద నున్నదదిగోవయ్యా పె.అ.రేకు:0013-03 శుద్ధవసంతం సంపుటము: 15-070 పల్లవి: ఏమిటం గడమ యిఁక హరిదాసులకు కామధేనువంటి ఘనముక్తి గలిగె చ. భగవన్నాము నిజపాలిజాతము గలుగ గగనఁపు మా కోరికలు ఫలించె జగదేక పతిరూప చంద్రచంద్రికలు గలుగ మొగిఁ జకోరపునేత్రములు తనవిఁబొందె చ. పరమాత్మ చింతనపు భానుఁ డుదయించఁగా సరుస మా చిత్తజలజంబు లలరే హరికథాశ్రుతి వసంతాగమము చెలఁగఁగా వరుసతో విజ్ఞాన వనమెల్ల ననిచె చ. చాల శ్రీ వేంకటేశ స్పరుశవేధిచే కాలజన్మపు టినుము కనక మాయ వల నాతని కృపాజాలజలనిధి చేత ఆలోల భక్తియను నమృతంబు వొడమె పె.అ.రేకు:0045-02 శంకరాభరణం సంపుటము: 15-255 పల్లవి: ఏమిటాఁ బోరాదు దేహి కిందిరా నాథుఁడే ఆముకొ నితని శరణనుటే వుపాయము చ. అట్టె కోపగించ నంటేనా నాజ్ఞ నడవదు పట్టి శిక్షించే నంటే పాపము హింస తొట్టి యేమీ నొల్లనంటే తోయదు సంసారము కట్టు కొంటే బంధము మోక్షమునకు దూరము చ. వొకరి రక్షీంచఁబోతే నొకరి కపకారము సకలము మానితేను జన్మము వృధా ఆకట దానము సేసే నంటే ధనము లేదు