పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

397 అకటా అంతలో భిక్షాన కేఁగుదు హరిఁ గొలిచినవాఁడగానైతి చ. తలఁచినచోటికి నేఁగఁ దలంతును తగఁ జన్నవారిని బ్రదికింతును మలసి యంతలోఁ బనులకుఁ బిలిచిన మఱియన్నియు నేమఱతును చెలఁగుచు నలమేల్మంగ విభుఁడ వో శ్రీవేంకటగిరి నిలయా నెలకొని నన్నిటు రక్షించఁగదవే నిను సేవించేవాఁడఁగానైతి పె.అ.రేకు:0026-06 గుజ్జరి సంపుటము: 15-152 పల్లవి: ఏమి సేయుదును నేనేమి సేయుదును స్వామిదోహమె జరగీని చ. నీ యాధీనమై నెగడిన యాత్మకు నీ యందె ಬುದ್ಧಿ ನಿಲುವಿಯಿು కాయపుటింద్రియ కల్పిత దేహము కాయపు విషయూలె కడుఁ గోరీని చ. నీ సంకల్పమున నెగడిన జగ మిది నీ సేవారతి నేరదు ఆసల నీ మాయ నంటిన మన సిది ఆసలాసలనే అలసీని చ. హరి నీవే నాలోన నణచిన జ్ఞానము హరి నీవె చూపక అందదూ సిరుల నా పాలిటి శ్రీ వేంకటేశ్వర కరుణానిధి నన్నుఁ గావవే రేకు:0311-03 శుద్ధవసంతం సంపుటము:04-063 పల్లవి: ఏమి సేయువాఁ డనివి విరసమొకటొకటి తామసంబొకవంక తత్వమొకవంక చ. యితరోపాయరాహిత్యుండు గాఁడేని అతిశయంబగు మోక్ష మది యబ్బదు సతతోద్యోగానుచరితుండు గాఁడేని విత్రతసంసారసుఖవిధి నడవదు చ. వివిధేంద్రియ విషయ విముఖుఁడు గాఁడేని యివల వైష్ణవధర్మమిది యబ్బదు అవిరళంబగు దేహానుపరణములేక భవమాత్రమున సుకృతఫల మబ్బదు చ. పరమానందంసంపన్నుండు గాఁడేని చరమవిజ్ఞాన నిశ్చలుఁడు గాఁడు యిరవయిన శ్రీవేంకటేశ యిటువలె నీవు కరుణించకున్న దుర్గతులచే భ్రమసీ రేకు:0095-05 లలిత సంపుటము: 01-475 పల్లవి: ఏమి సేసినా నీరుణ మెట్టు వాసును కామితఫలద వోకరుణానిధి చ. చేరి కర్మములు నన్ను చెఱవట్టకుండగాను పేరువాడి వచ్చి విడిపించుకొంటివి సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా నారయ దీనులఁ గంటే నడ్డమైకాతురు చ. అరులు పంచేంద్రియము లందు నిందు దియ్యఁగాను వెరవుతోడ వెనక వేసుకొంటివి పరగ నట్టేకాదా బలువులైనవారు