పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

396 అడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదు యిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు చ. వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు మెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదు యెచ్చరికం దిరువేంకటేశుఁ గొలువక వుంటే యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు రేకు:0102-05 సామంతం సంపుటము: 02-011 పల్లవి: ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుఁడా నీమఱఁగు చొచ్చితిని నెరవేర్తు గాక చ. కడివోని జవ్వనము కలిమిలేమెఱుఁగునా బడినుండి మిగుల రుణపరచుఁ గాక అడియాసలెల్లాఁ బుణ్యముఁ బాప మెఱుఁగునా వెడగుఁ దనలో దయ విడిపించుఁ గాక చ. వలపు వెఱ పెఱుఁగునా వాఁడిమొనలకునైన బలిమిఁ దూరించఁ జలపట్టుఁ గాక చలనమందిన మనసు జాతి నీతెఱుఁగునా కలిసి హేయమున కొడిగట్టించుఁ గాక చ. యెలమి రతిపరవశము యెగుసిగ్లెఱుఁగునా బలిమిఁ దిట్లకు నొడఁబఱచుఁ గాక యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి తలఁగించి యేలితివి దయసేతు గాక రేకు:0281-01 శుద్ధవసంతం సంపుటము:03-465 పల్లవి: ఏమి సేయుదును నా కేది బుద్ధి యంతర్యామి యీమతులఁ జిక్కి నీచిత్తమునకు నెట్టుండునో యని చింతయ్యెడిని చ. కులగోత్రంబులు గుణశీలంబులు తెలియఁగ గర్వోడ్రేకములు కలసి మెలఁగినఁ గలుగదు జ్ఞానము తొలఁగిన లోకద్రోహంబు చ. మఱియు గృహారామక్షేత్రంబులు జఱిగొను మూయూజనకములు మఱవఁగ నివియే మదకారణములు విఱిగిన సంసారవిరుద్ధము (?) చ. అనుపమ వ్రతకర్మానుష్టానము లెనలేని బంధ హేతువులు తనిసితి నింక నీదాస్యంబే గతి ఘనుఁడవు శ్రీవేంకటనాథా పె.అ.రేకు : 0067-06 భూపాళంసంపుటము: 15-387 పల్లవి: ఏమి సేయుదును నా యుద్యోగముయెంతో నా యాసోదము కామింతుఁ గాని యిందులో నొకటిఁగలుగదు వృధా మనోరాజ్యము చ. ఆకరుషించఁ దలంతును అప్సరోగణములను కైకొని దేవతాసమితినిఁ గనుఁగొనఁ దలంతును యేకముగా బ్రహ్మాదిలోకము లేలఁ దలఁతును దాకొని నిద్రింతు నంతలోన హరిఁ దలఁచినవాఁడఁగానైతి చ. ఒకపరి యూశ్వరుఁడ నౌదును వూహాపాశీహలను ప్రకటపు పట్టణగోపురప్రాకారంబులు సృజింతును సకలము భోగించినవాఁడ నౌదు చవులూరకే కొందును