పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

395 వుడివోవు కోరికలు వొదుగదు కోపము కడదాఁకా నీమహిమ కాదనరాదు చ. భావించలేనివాఁడను ప్రకృతిలోనివాఁడను శ్రీవేంకటేశ దయ సేసితివి నీవు తోవదప్పదు జ్ఞానము తొలఁగదు వివేకము దేవుఁడవు నీమర్మము తెలియఁగరాదు రేకు:0235-04 కాంబోది సంపుటము: 03-201 పల్లవి: ఏమి సేయఁగలవార మెందుకు నౌదుము నేము శ్రీమాధవ నీవే దయఁ జిత్తగించు మమ్మును చ. వేసరక పుణ్యాలు గావించేదే యరుదుగాని సే సేనంటే పాపములు చేతిలోనివే గాసిలక చూచితేఁ జీఁకటైనా వెలుఁగౌఁగాని వీసమంత మఱచినా వెలుఁగైనాఁ జీఁకటే చ. తెలివితో మోక్షము సాధించేదే యొక్కుడుగాని అలయించే లోకములెన్నెనా గలవు తలఁచితే నీరూపము తోనే యెదుటనుండు యిలఁ బరాకై వుండితే నెచ్చోటాఁ జిక్కదు చ. యీవల నీ దాఁసుడయ్యేది ఘనముగాని దావతి రాజసాలంతటా నున్నవి శ్రీవేంకటేశ్వర నీ సేవే ధ్రువపదము దేవతాంతరమెల్లా దిగుడుకు దిగుడు రేకు: 0036-02 ఆహిరి సంపుటము: 01-221 పల్లవి: ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు తామసపుబుద్ధి కంత్రలు దూరవలసె చ. తెగి దురాపేక్షఁబడ తివియ గతిలేదుగన పగగొన్న వగలకూపములఁ బడవలసె తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన మగుడఁబడి భవముతో మల్లాడవలసె చ. పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన కోపబుద్దులచేత కొరమాలవలసె రూపములఁ బొడగాంచి రోయఁదరిలేదుగన తాపములచేఁ బొరలి తగులుగావలసె చ. తిరువేంకటాచలాధిపుఁగొలువలేదుగన గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె పరతత్వమూర్తిఁ దలంపఁగఁ బ్రోద్దులేదుగన దొరతనం బుడిగి యూతురుఁడు గావలసె రేకు:0009-01 సామంతం సంపుటము: 01-055 పల్లవి: ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదు తాము సేసినంత వట్టు తమకుఁ బోరాదు చ. ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపు బట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదు తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు తెట్టుదెరువున నోరుదెరచినా లేదు చ. అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి విడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదు