పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

394 గూఁటఁబడే పదవులు గోరేటిజీవుఁడు కూటువైననిజముక్తి గోరడిఁది యేఁటికే చ. పాపపుణ్యములకె పాలుపడ్డ నేను యేపున నీపాలఁ జిక్క నేలకో హరి శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుఁడ నీపేరివాఁడ నాకు నిండుమాయ లేఁటికే రేకు:0257-04 కన్నడగౌళ సంపుటము: 03-329 పల్లవి: ఏమి సేయఁగల యెంతాశకుఁడను తామసపు మనసు తనియదు నాకు చ. యిలలోపల నూరేండ్లబ్ల దుకే కలవుద్యోగము కల్పాంతంబులు నిలిచినవాఁడను నేనొక్కఁడనే పలుసంసారము బండ్లకొలఁది చ. ఆరయఁ బట్టెడు అన్నమువాఁడను కోరిన కోర్కులు కోటానఁగోట్లు నారవంటిదే నల్లెఁడు నాలుక తీరవు రుచులివె తెప్పలకొలఁది చ. నిరతరతిసుఖము నిమిషములోనిదే విరహపు వెదలు వేవేలు యిరవుగ శ్రీవేంకటేశ నీమఱఁగు చొరఁగా నాకివి సులభములాయ రేకు:0293–03 రామక్రియ సంపుటము: 03-538 పల్లవి: ఏమి సేయఁగలఁడు తానీ జగమెల్లాను కోమలపు దేహి కొక్కకోకే కలది చ. మించిన కోరికలివి మిన్నుల పొడవులు కొంచపు దేహము దనకొలఁది గాదు యెంచరాని సిరు లవి యెన్ని గలిగినా కంచములోని కూడే కలిగినది చ. గోరపడి గడించేవి కోట్ల కొలఁదులు త్రాల త్రూల నోటికిఁ దగ్గంత గాదు యేరుపరచి యింతుల నెందరిఁ బెండ్లాడినాను కూలిమి సత్రి యొకతె కూటమికిఁ గలది చ. తలఁచి మొక్కే సురలు తలవెంట్రుకలందరు యిలఁ దన బతుకెంతో యెరఁగరాదు చెలఁగి రక్షించేవాఁడు శ్రీవేంకటేశుఁ డొకఁడే కల డంతరంగమునఁ గైవల్యమే కలది రేకు:0235-03 ఆహిరి సంపుటము: 03-200 పల్లవి: ఏమి సేయఁగలవాఁడ నిదివో నేను నీమరఁగు చొచ్చితిఁగా నీచిత్త మిఁకను చ. పుట్టినవాఁడను నేను భోగించేవాఁడను నేను గట్టిగా నిప్పుడు నాకుఁ గర్తవు నీవు పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము యిట్టి వెల్ల నీమాయ యేమీ ననరాదు చ. కడుఁగాంక్షలు నాసామ్ము కర్మములు నాసామ్ము నడము నంతర్యామివి నాకు నీవు