పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

393 కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే పై కొనఁగఁ గరుణించె భాష్యకారులు చ. పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁబరమిచ్చిన వేంకటేశుకృపతోడ వెలయఁ దానే తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన పంకమెల్లఁబోఁగడిగె భాష్యకారులు రేకు:0041-02 వరాళి సంపుటము: 01-250 పల్లవి: ఏమి నేయువార మిఁకను ఆమని చేలపచ్చలాయ బ్రదుకు చ. దీపనమనియెడి తీరని యూస రేపుమాపుఁ బెడరేఁచఁగా తోపునేయఁగరాక దురితపుతరవుల - కాపదలకు లోనాయ బ్రదుకు చ. వేడుకనెడి పెద్దవిడువనితరవు వోడ కెపుడు వొద్దనుండఁగా జోడు విడువరాక చులుకఁదనంబునకాడికెలకు లోనాయ బ్రదుకు చ. మమకారమనియెడిమాయతరవు తిమిర మెక్కించుక తియ్యఁగా విమలమూరితియైన వేంకటగిరిపతి అమరఁ జేరక యరవాయ బ్రదుకు రేకు:0066–06 శుద్దవసంతం సంపుటము:01-345 పల్లవి: ఏమి వొరలేరు యేమి మరలేదు యీ మాయలంపటం జీఁదమోఁదనేకాని చ. సతులుగలమేలు దా సడిఁబొరలనేకాని సతమైన సౌఖ్యస్వస్థానంబు లేదు హితులు గలమేలు తా నిడుమఁబొరలనె కాని హితవివేకము నరుల కెంతైన లేదు చ. తనువు లెత్తినమేలు తగులాయమేకాని కనుఁగొనఁగ యోగబోగము గొంత్ర లేదు ఘనము గలమేలు తా గర్వాంధమేకాని ఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు చ. చింతగలిగిన మేలు చివుకఁబట్టనెకాని చింత వేంకటవిభునిఁ జింతించ లేదు సంతు గలిగిన మేలు సంసారమే కాని సంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు రేకు: 0335-03 బలహంస సంపుటము: 04-204 పల్లవి: ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయ రాదా సామజగురుఁడ నీతో సంగమొల్ల దేఁటికే చ. మాయలసంసారము మరిగిన కర్మము ఈయెడ నిను మరుగ దేఁటికో హరి కాయజకేలిపైఁ దమిగలిగిన మనసు కాయజుతండ్రి నీపైఁ గలుగ దిదేఁటికే చ. నాటకపుఁగనకము నమ్మినట్టిబదుకు యేఁటికి నీభక్తి నమ్మదేలే హరి