పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

392 కొత్తవెంట్రుకల గుబురుల గంతికి పొత్తుల సంసారభోగము గలిగె చ. నానా ముఖముల నరముల పిడుచకు పూనిన సిగ్గులు భువిఁ గలిగె ఆనుక శ్రీవేంకటాధిపుఁ డేలఁగ దీనికిఁ బ్రాణము తిరముగఁ గలిగె రేకు: 9018-01 ఆహరి సంపుటము: 04-537 పల్లవి: ఏమి దిరిగేమెందైనను ఊర కోమిత్రిమి దేహమోహారోబదుకు చ. బ్రహ్మ కల్పము దాఁక బ్రదికేమో, కాక బ్రహ్మానందంబుఁ బడసేమా బ్రహ్మ మీ దేహలంపట మనుచు పరం బ్రహ్మంబు వదలితిమి బాపు బ్రదుకు చ. ఒడిలితో నిట్టనే వుండేమా, కాక చెడని పుణ్యములెల్లఁ జేసేమా యొడయకమరపదం బేలేమా, వృథా చెడిపోయె దినములిస్సీ బదుకా చ. ఆపదలు లేని సుఖమందేమా, కాక పాపంబు లేని మతిఁ బరగేమా ఏపు మీరిని వేంకటేశ్వరునిఁ గొలువ నోపకిట్టెతిమయ్యో బదుకా రేకు:0284-03 భూపాళం సంపుటము: 03-484 పల్లవి: ఏమి నిద్దిరించేవు యెందాఁకాను కామించి బ్రహ్మాదులెల్లఁ గాచుకున్నా రిదివో చ. పులుఁగాలుఁ బచ్చళ్ళు బోనము వెట్టినదిదే వెలయు ధనుర్మాస వేళయు నిదే బలసి సంకీర్తనపరులు పాడేరిదే జలజాక్షుఁడ లేచి జలక మాడవయ్యా చ. తోడనే గంధాక్షతలు ధూపదీపా లివిగో కూడిన విప్టుల వేద ఘనోషణ లివే వాడుదేరఁ బూజించవలెఁ గమ్మఁబువ్వలివె వీడెమిదె కొలువుకు విచ్చేయవయ్యా చ. చదివేరు వైష్ణవులు సారెఁ దిరువాము డిదె కదిసి శ్రీసతి ముందే కాచుకున్నది అదనాయ శ్రీవేంకటాధిప మా చరపిదే యెదుట నిన్నటిమా పే యియ్యకొంటివయ్యా రేకు:0027-01 ఆహిరి సంపుటము: 01-162 పల్లవి: ఏమి నెఱఁగనిమమ్ము నెక్కువనేసి పామరుల దొడ్డఁజేసె భాష్యకారులు చ. గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి అతనికరుణచేత నన్నియుఁ గని గతిలేకపోయునక లియుగమున వచ్చి ప్రతిపాలించంగలిగె భాష్యకారులు చ. లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి ఆకుమీఁదఁ దేలిన యతనికృప