పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

391 కొందరి వునుకులు వూర్ధ్వలోకములు కొందరివునుకులు పాతాళంబు అందరు నందరె వాలివాలి రుచు లివిగా దిది(వి?) యనరాదు కందువ జీవులు విచారించేటి కార్యాకార్యము లిఁకనేదయ్యా చ. కొంతభూమి నటు చీఁకటినిండినఁ గొంతభూమి వెన్నెల గాయు కొంతట సురలును కొంతట నసురలు కోరికై కొనిరి జగమెల్లా ఇంతట శ్రీవేంకటేశ్వర నీవే యిందరి యంతర్యామివి చింతలు వాయవు యెవ్వరిమనసునఁ జేరి నీకు శరణంటేఁ గాని పె.అ.రేకు:0054-01 భైరవి సంపుటము: 15-305 పల్లవి: ఏమి చెప్పేది నీ సుద్దు లిటువంటివి గోమున లోకరక్షణకొఱకు నిట్లేతివి చ. అట్టె నాఁడు వేదచోరు నదటడంచిన నీవు నెట్టన నేఁడెట్టు నవనీత చోరుఁడ వైతివి జట్టిగా బ్రహ్మదులకు జనకుఁడవైన నీవు గుట్టున వసుదేవున కొడుక ಪಜ್ಜತಿಖ చ. చేముంచి జితకాములచేతికి లోనైన నీవు యేమీ రేపల్లె జారుఁడ వేలైతివి ఆమీఁద జగదురుఁడవై వుండిన యట్టి నీవు సీమలో సాందీపనికి శిష్యుడ వెబ్లెతివి చ. కోటుల బ్రహ్మాండములు కుక్షి నిడుకొన్న నీవు ఆటలకు బలి నేల యాచించితివి వాటమై శ్రీవేంకటేశ వరము లిందరి కిచ్చి నీటునఁ బరుషల కానికె లేల కొంటివి రేకు: 0348-01 దేవక్రియ సంపుటము: 04-279 పల్లవి: ఏమి చెప్పేది ప్రతాప మెట్టి విలుకాఁడితఁడు రాముఁడు వీఁడే మైుక్కుఁడు రణరంగధీరుఁడు చ. విడిసెC గపిబలము వెస సముద్రము దరి నడచె లంకపైఁ బౌఁజు నానాగతుల తొడిగె రాముఁడు వింట దొనలోని బ్రహ్మాస్త్రము పడె రావణుతలలు పంక్తులై ధరణిని చ. చొచ్చిరి లంకలోను సుగ్రీవాంగదాదులు తెచ్చిరి రాకాసి చెర తెప్పలుగాను యిచ్చిరి జయధ్వనులు యింద్రాదిదేవతలు మెచ్చిరందరు సీతాసమేతుఁడాయ నితఁడు చ. మగుడెఁ బుష్పకముపై మహిమ నీతనిదండు తగఁ బట్టము తా నేలె తమ్ములతోను అగపడి శ్రీవేంకటాద్రిపె నిల్చె నితఁడు జగదేకమూర్తి కౌసల్యాసుతుఁ డిపుడు రేకు: 0153-06 శ్రీరాగం సంపుటము:02-251 పల్లవి: ఏమి చెప్పేదిది యీశ్వరమాయలు దీము ప్రతిమకును త్రిజగము గలిగె చ. మలమూత్రంబుల మాంసపుముద్దకు కులగోత్రంబుల గుఱి గలిగె తొలులు తొమ్మిదగు తోలుఁదిత్తికిని పిలువఁగఁ బేరును బెంపునుఁ గలిగె చ. నెత్తురునెమ్మల నీరుబుగ్గకును హత్తిన కర్మము లటు గలగె