పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

390 చ. దట్టముగఁ బారావతముల మిన్నుల మోవ కొట్టఁగొన కెక్కవా కూడి కూడి వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు బట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట చ. బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్ల పారలదా పలుమారుఁ బోయిపోయి వరుస జన్మముల నటువలెనె పొరలితిమి తిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక పె.అ.రేకు : 0038-04 భూపాళంసంపుటము: 15-216 పల్లవి: ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయావినోదము వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మాతరములా చ. సకలలోక నివాసనాయక శౌరి మురహర నరహరీ ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చవటంచును వికటముగ నినుఁ గన్నతల్లి వేల నీ వదనంబు మీఁటిన అకట హా యని నోరు దెరచిన యందు లోకము లుండెను చ. శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక రాసి కెక్కెను బండిరొప్పిన రవ్వలా నీ సేఁతలు మోసమున నరునుఁడు నీలో ముందు గానక మాటలాడిన వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు చ. నమోనమో శ్రీ వేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల విమలమగు నీ దాసు లిదె నీ విద్య లెల్లాఁ జూచిరి సుముఖులై కరి శబరి బలియును శుకద్రువాదులు నిన్నుఁ గొలువఁగ సమత వున్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి పె.శ్రీ.అ.రేకు: 8008-04 శంకరాభరణం సంపుటము: 15-459 పల్లవి: ఏమి చెప్పెడి దిందు నేమి గలదు సామజముతోఁ బెనఁగ సమకొనెడు మనికి చ. బొంతవలపులతోడఁ బొరలాడు మనికి దొంతి యాపదలె తనతొడవైన మనికి ముంతలోపలినీట మునిఁగేటి మనికి సంతలో కూటములె చవియైన మనికి చ. కొనకొన్న దురితములె కూడైన మనికి కను మాయ సంపదలఁగాఁగేటి మనికి పనిలేని విషయముల బంటైన మనికి వెనక ముందర చూడ వెఱపైన మనికి చ. యేవగింతల యాట నెదురీఁదు మనికి చావుతో సరియైన జగడంపు మనికి శ్రీవేంకటేశునిఁ జింతసేయని మనికి యిూవలావలఁ దిరిగి యిటైన మనికి రేకు:0260-04 పాడి సంపుటము:03–346 పల్లవి: ఏమి చెప్పెడినో శాస్త్రరహస్యము యేమిచెప్పెడినొ వేదములు తామసమై బహునాయకమాయను తత్త్వ మెఱంగఁగఁ దరమేదయ్యా చ. కొన్నిజంతువులు రోసిన హేయము కొన్నిజంతువుల కమృతము కొన్నిజంతువుల దివములే రాత్రులు కొన్నిజంతువులకు అన్నియు నిట్లనె వొక్కటొక్కటికి అన్యోన్య విరుద్ధములు పన్నిన జీవుల కేకసమ్మతము భావించఁగ మరి ఇఁక నేదయ్యా చ. కొందరు విడిచిన సంసారము మరికొందరికి నది భోగ్యంబు