పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

389 చ. సతులంసంగడి నున్న సమసీని కాలము వెతలఁ బొరలినాను వెళ్ళీని కాలము సతతము దొంగిలినా చనిపాశీయూఁ గాలము వ్రతియై యుండి తేను వసమాను కాలము చ. పాలుమాని వుండినాను పరివోవుఁ గాలము కూళగోష్టినుండినాను కొరెంచపడుఁ గాలము మేలులో శ్రీవేంకటేశు మేటికతలు వినుచు తాలిమితో నుండినాను దక్కియుండుఁ గాలము రేకు:0018-06 శ్రీరాగం సంపుటము: 01-112 పల్లవి: ఏమి గలదిందు నెంత గాలంబైన పామరపు భోగ మాపదవంటి దరయ చ. కొండవంటిది యూస, గోడ వంటిది తగులు బెండువంటిది లోని పెద్దతనము పుండువంటిది మేను, పోలించినను మేడి_ పండువంటిది సరసభావమింతియును చ. కంచువంటిది మనసు, కలిమిగలదింతియును మంచువంటిది,రతి భ్రమతవంటిది మించువంటిది రూపు, మెలింతియును ముట్టు పెంచువంటిది,దీనిప్రియ మేమి బ్రాఁతి చ. ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత పాఁకువంటిది కర్మ బంధమెల్ల యేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కి కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ రేకు:0064-01 వరాళి సంపుటము: 01-328 పల్లవి: ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా కాముకపు మనసునకు కడ మొదలు లేదు చ. వత్తిలోపలి నూనె వంటిది జీవనము విత్తుమీదటి పొల్లు విధము దేహంబు బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక చ. ఆకాశ పాకాశ మరుదైన కూటంబు లోకరంజకము తమలోనిసమ్మతము చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు చేకొనిననేమి యివి చెదిరిననునేమి చ. గాదెఁబోసిన కొలుచుకర్మిసంసారంబు వేదు విడువనికూడు వెడమాయబదుకు వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపామోదంబు వడసినను మోక్షంబు గనుట రేకు: 0035-05 ఆహిరి సంపుటము: 01-218 పల్లవి: ఏమి గలిగెను మా కిందువలన వేమారుఁ బొరలితిమి వెట్టిగొన్నట్లు చ. తటతటన నీటిమీఁదట నాలజాలంబు లిటునటుఁ జలిOచవా యూ(ది యూ(ది అటువలెనె పాశీ తమకమంది సంసారంప)ఘటనకై తిరిగితిమి కడ గానలేక