పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

388 వదలక యింద్రియవర్గంబులకే వెదకీ నిదివో వీటిడి మనసూ చ. జననమరణముల చరాచరములను కనియును మీఁ దెఱఁగదు మనసూ ఘననంసారపు కాణాచులకే దినదినకాంక్షల దిరిగీ మనసూ చ. కలగని యటు మేల్కని చూచి తెలిసి చెలఁగి రెంట నడచీ మనసు బలిమి శ్రీవేంకటపతి రక్షింపఁగ కొలిచి యూత్రనికి కొసరీ మనసూ రేకు: 0379-05 దేశాక్షి సంపుటము:04-463 పల్లవి: ఏమరక తలఁచరో యిదే చాలు కామించినవి యెల్లఁగక్కుననే కలుగు చ. దురితములెల్లఁ దీరు దుఃఖములెల్ల నణఁగు హరియని వొకమాఁటు అన్నాఁజాలు సురలు వూజింతురు సిరులెల్లఁ జేరును మరుగురునామ మటు పరుకొన్నఁ జాలు చ. భవములిన్నియుఁ బాయు పరము నిహముఁజేరు అవల నారాయణయన్నాఁ జాలు భువి యెల్లాఁ దానేలు పుణ్యములిన్నియుఁజేరు తవిలి గోవిందు నాత్మఁదలఁచినఁ జాలు చ. ఆనందము గలుగు నజ్ఞానమెల్లఁ బాయు ఆనుక శ్రీ వేంకటేశ యన్నాఁ జాలు యీ నెపాన నారదాదు లిందరు నిందుకు సాక్షి దానవారి మంత్రజప తపమే చాలు పె.అ.రేకు:0047-04 బౌళి సంపుటము: 15-267 పల్లవి: ఏమఱఁ జనదు బ్రదికేటి కాలము యొఱిఁగిన మహాత్ములకును శ్రీమంతుఁడగు హరినేతలఁచిన చీఁకటు లన్నియుఁ బెడఁబాయు చ. చేరి వుండెడిది బ్రహ్మలోకమటశ్వేతుఁ డను రాజట భువిమీఁదకి కారణమున నేతెంచి నిత్యమును కళేబరంబట తన కాహారము ఆరయ సంపదలే పనికివచ్చునట లో కాంతరగతి నే మున్నది శ్రీరమణునికే శరణు చొచ్చినను చెడని భోగములు చేచేతఁ గలుగు చ. చేసన క్రతువులు నూఱట నహుషుడు చెలఁగుచు దేవేంద్రపట్ట మేలె నట దోస మించుకంతకుఁగా భువిపైఁ దలుచుఁ బామై పడియె నటా ఆసలఁ గర్మము నెట్టు నమ్మెడిది అమరత్వము ఫలమది యెట్లించుట వాసుదేవునిఁ గొలిచి తా నతనివాఁడై యుండిననెలకొను శుభము చ. వెలయఁగ త్రిశంకు డనియోడి రాజట విశ్వామిత్రుని పరిగ్రహం బట అలరిన చండాలత్వ మొందె నట యంతరిక్షమున నుండెనటా బలుములు యెందాఁక వెంటవచ్చును పాయంబులుమఱి చెప్పఁగనేలా యిలధరుఁడగు శ్రీవేంకటేశ్వరుని నెఱిఁగి దాసుఁడగుటే సత్పలము పె.అ.రేకు:0048-02 శుద్ధవసంతం సంపుటము: 15-270 పల్లవి: ఏమఱకు జీవుఁడా యే కాలమూ నేమముతో నుండితేనే నిలుచును కాలము చ. కడఁగి జూజమాడితేఁ గడచీన కాలము నడుమ వేఁటలాడితే నడచీని కాలము జడియుచు నిద్రించితే జరడీని కాలము నిడివి హరిఁ గొల్చితే నిండుకుండుఁ గాలము