పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

387 కొండలంతలై కుప్పలువడియెను వOడCదరగు రావణుత్రలలOు చ. పూడెను జలధులు పారిఁ గోపించిన తోడ బ్రహ్మాండము తూఁటాయ చూడఁ బాతాళము చొచ్చె బలీంద్రుఁడు కూడిన కౌరవకులములు నడఁగె చ. యెత్తితివి జగము లీరేడు నొకపరి యిత్తల నభయం బిచ్చితివి హత్తిన శ్రీవేంకటాధిప నీకృప నిత్తెమాయ నీనిజదాసులకు రేకు: 0336-01 నాదరామక్రియ సంపుటము: 04-208 పల్లవి: ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు శ్రీమాధవుడ నీకుఁ జేతికి లోనయ్య చ. పుట్టినదె వొకతప్ప భువిమీఁద నటమీఁద నెట్టన సంసారినౌటే నిజము రెండోతప్ప రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూఁడోతప్ప యిట్టె కావు కావకుండు మిదివో నాతప్పు చ. అన్నపానములు గోరినదియే మొదలి బందె యెన్నఁగఁ గాంతలఁ గూడుటిదివో రాత్రిటిబందె కన్నవారి వేఁడేది కడతొడుకుబందె కొన్నిట నేమి గొనేవు కొనవయ్య బందె చ. కొనఁ బుణ్యపాపాలే గొడియకట్లు రెండు కొనిరి నీదాసులే కోరిన తప్పదండము వినవయ్య యిదివో శ్రీ వేంకటేశ నామనవి మనుఁగాఁపుఁ జేసితివి మన్నించవయ్య రేకు:0149-02 కాంబోది సంపుటము: 02-224 పల్లవి: ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము కామించి మీ శరణంటిఁ గమలారమణా చ. కలది యందరికైతేఁ గర్మఫలము కెలన నాకైతే నీకృపాఫలము అల సురలకు మధితామృతము నెలకొన్న నాకైతే నీనామామృతము చ. సకలాత్మల బ్రదుకు సంసారమూలము ప్రకటించ నాకైతే నీ పాదమూలము వెకలి లోకులరతి వీధివీధిని నాత్రికరణరతి నీదివ్యభావవీథిని చ. రంగుగ బాOధవ ముOదరకు బOధుజనులOదు సంగతి నాకు నీ భక్తజనులయందు అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి చెంగట నా ధ్యానము నీ శ్రీమూర్తియందు పె.అ.రేకు:0014-07 గుజ్జరి సంపుటము: 15-080 పల్లవి: ఏమని వున్నదో యీ మనసు కోమల మెప్పుడు కొరతే మనసు చ. ముదిసేటివారల ములిగేటివారల కదిసిచూచి కల(గదు మనసు