పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

386 చుట్టరికమెంచేవారి చోటికిఁ దల్లిదండ్రివి ముట్టి కొలిచినవారి ముంజీతమవు చ. సేవ చేసినవారికి చేతిలో మాణికమవు భావించువారికి పరబ్రహ్మమవు కావలెనన్నవారికి ఘన మనోరథమవు వావిలిఁ బూజించువారి వజ్రపంజరమవు చ. బత్తి సేసినవారికి భవరోగ వైద్యుఁడవు హత్తి నుతించినవారి యానందమవు పొత్తుల అలమేల్మంగ బువ్వపు శ్రీవేంకటేశ ఇత్తల మా పాలిటికి నిహపరదాతవు రేకు: 0141-03 వరాళి సంపుటము:02-180 పల్లవి: ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ కామించి బ్రహ్మాదులనుఁ గప్పీ నీమాయ చ. బచ్చెనరూపుల పెక్కు పడెచ్చుల వేసినట్లు నిచ్చల నినుచున్నది నీమాయ తచ్చి వారివారిరతి తమతమకే తెలియ పచ్చిగా భోగింపించీ దంపతుల నీమాయ చ. మఱి తొలునాటి భోగాలు మరునాటికి నింతగా నెఱువుగాఁ దమకించీ నీమాయ విఱచరాని దుఃఖము వెస నిద్రవోయితేనే మఱపించి నవ్వించీ మహిలో నీమాయ చ. పట్టరాని జవ్వనము పరసిపోతే ముదిమి నెట్టుకొల్పి వుబ్బఁడచీ నీమాయ గట్టిగా శ్రీవేంకటేశ ఘనుఁడవైన నీదాసుల పట్టకుండాఁ జేయుము బలిసె నీమాయ రేకు: 0383-01 రామక్రియ సంపుటము: 04-482 పల్లవి: ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము వేమరు నో పుణ్యులాల వినరో యీ కతలు చ. అనంత సూర్య తేజుఁడట కాంతి చెప్ప నెంత దనుజాంతకుఁడట ప్రతాప మెంత మనసిజ గురుఁడట మరి చక్కఁదన మెంత వనజజుఁగనినట్టి వా(డటు ఘన తెOత చ. గంగా జనకుఁడట కడుఁ జెప్పే పుణ్య మెంత చెంగట భూ కాంతుఁడట సింగార మెOత్ర రంగగు లక్షీశుఁడట రాజసము లెంచ నెంత అంగవించు సర్వేశుఁడట సంప దెంత చ. మూయూనాధు(డట మహిమ వచిOచు టెOత్ర యేయోడఁ దా విష్ణుఁడట యిర వెంత పాయక శ్రీ వేంకటాద్రిపతియై వరములచ్చే వేయి రూపులవాఁడట విస్తార మెంత రేకు: 0303-05 సాళంగనాట సంపుటము:04-017 పల్లవి: ఏమని పొగడుదు ನಿಲ್ಹೆ నీగుణము యూ మహిమకుఁ బ్రతి యితరులు గలరా చ. నిండెను జగముల నీ ప్రతాపములు చెండిన బాణునిచేతులతో