పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

385 పవనునికి భువికి పదునాలులోకములకవల వేరొకచోట నాధార మున్నదా చ. తిలకింపఁ గులాచలదిగ్గజశేషాదులకు నిలువఁ జోటున్నదా నీవే యాధారము గాక నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు కలది నీయాధారమే కాక వేర వున్నదా చ. అనంతబ్రహ్మాండముల కట్టే నీరూపములకు వెనకముందున్నదా నీవే యాధారముగాక వినుతికెక్కిన శ్రీవేంకటేశ నీకు నీవే మనికైన యాధారము మఱి యొంచ నున్నదా పె.అ.రేకు : 0049-03 పాడి సంపుటము: 15-277 పల్లవి: ఏమని తలఁచవచ్చు నెవ్వరిఁ గా దనవచ్చు కామించే వారివారి కర్మఫలమహిమ చ. చల్లనే చందురుఁడు సర్వమైన వారికి వెల్లివిరి విరహికి వెట్టమైతోఁచు యెల్లవారికి నన్న మిలఁ బ్రాణమై వుండు నల్లన రోగికిఁ దానే యరుచియై తోఁచును చ. పమ్మిన సంపంగిపూవు పరిమళ మందరికి తుమ్మిదకే విరసమై తోఁచుఁ గాని వుమ్మడి సూర్యుఁడెప్పుడు నొగి లోకబాంధవుఁడు కమ్మి కలువలకే కడుఁ బగయి తోఁచును చ. శ్రీవేంకటేశుఁడు శిష్ట కెల్లాఁ బ్రియుఁడు భావింపఁగ దుష్ట కే భయంకరుఁడు పావనపు హరినామపఠనపుణ్యుల మెచ్చు యీవలావలి మూరల కెరవయి తోఁచును రేకు: 0172-01 ప్రతాపనాట సంపుటము: 02-350 పల్లవి: ఏమని నుతించవచ్చు నితనిరూపము భీమవిక్రమం డితఁడు పెద్ద హనుమంతుడు చ. వొక్కజంగం చాఁచినాఁడు వొగిఁ దూర్పుఁబడమర తక్కక భుజా లుబ్బించె దక్షిణోత్తరాలు నిండ మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెతైను పిక్కటిల్లు మహిమతోఁ బెద్ద హనుమంతుఁడు చ. వేడుక వాల మాకాశవీధితోఁ బెనచినాఁడు యేడుజలధులు చేసె నదె మోకాళ్లబంటి వోడక పిడికిలించి వుగ్రదైత్యుల తలలు బేడలుగాఁ జేసినాఁడు పెద్ద హనుమంతుఁడు చ. జళిపించి వలకేలు సకలము మెచ్చ నెత్తె కులగిరులు తనతొడలసందినే యడఁచె బలువుఁడు శ్రీవేంకటపతిబంటు మతంగాద్రిబిలమువాత నున్నాఁడు పెద్దహనుమంతుఁడు రేకు:0288-03 దేవగాంధారి సంపుటము: 03-508 పల్లవి: ఏమని నుతింతు నేను యిందిరానాయక నీవు కామించి కోరినవారి కల్పలతవు చ. నెట్టనఁ దలఁచేవారి నిండు నిధానమవు పట్టినవారి చేతి బంగారమవు