పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

384 పల్లవి: ఏమని చెప్పుట మా యజ్ఞానము యెఱిఁగి యెఱిఁగి తెలియఁగలేము శ్రీమాధవనీ మఱుఁగు చొచ్చితిమి చిత్తగించి దయఁచూడఁగదే చ. నీవు రక్షకుఁడవై భువి నుండఁగ నే గడియించే దిఁక నేమీ జీవాంతరాత్ముఁడవై యుండుదువట చేకొని కావక మానేవా వేవేలుగఁ బుట్టించఁ గర్తవట వెలయించఁగ నీ భారము గాదా భావించనేరక వట్టి స్వతంత్రము పయివేసికొనుచుఁ బరగేము చ. పలుదెఱఁగుల నీ నామము లుండఁగ పాపములకు వెఱవఁగనేలా బలిమినీ ముద్రలు యంతటఁ జెల్లఁగ పై కొనునా యింక నరకముల తలఁక కభయహస్తము నీ వెత్తఁగ దాసుల కిఁక నెక్కటి భీతి నిలుపఁగ నేరక మనసు వెంబడినే నిచ్చనిచ్చలునుఁ బొరలేము చ. అది నీరూపము తిరువారాధన యైయుండఁగ వెదకంగ నేలా పదిలపుటాచార్యుఁడు గలుగఁగ నిహపరముల త్రోవడుగఁగ నేలా వుదుటున వరములు శ్రీవేంకటేశుఁ డొసగఁగ నే కోరఁగ నేలా తుదమొద లెంచక యిన్నాళ్లు నేమఱి దొరకొని యింక నుతి యించేము రేకు:0367-02 శుద్ధవసంతంసంపుటము:04-394 పల్లవి: ఏమని చెప్పెద నిటమీఁద హరీ శ్రీ మంతుఁడ నినుఁ జేరితి మిదివో చ. వినుచున్నారము వెనకటిపాటు కనుచున్నారము కలఁగేటివారల దిన దిన భావము తెలిసీఁ దెలియదు మనసున భయ మిసుమంతయు లేదు చ. భువి నెరుఁగుదు మిదె పుట్టెడి దెసలను తవిలి మరణములు దలఁచెద మట్లనె వివరపు టాసలు విడిచీ విడువవు నవమగు విరక్తి నాఁటదు వోయె చ. చదివెద మిదివో సకల శాస్త్రములు వెదకెద మిదె శ్రీ వేంకటేశ నిను మదిలోనుండగఁ మరచివుంటి మిదె యెదుట(గంటి మిఁక యేలాపనులు రేకు:0144-01 సాళంగనాట సంపుటము: 02-194 పల్లవి: ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచి త్తము దీమసాన నీభావము తెలియ దెవ్వరికి చ. రవిచంద్రగ్రహ తారకములకుఁ దెరువు వివరించనున్నదా నీవే యాధారముగాక