పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

383 పల్లవి: ఏమని చెప్పఁగవచ్చునిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ చ. వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపులసురలకు వరుస వనవాసపు వ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ చ. వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదేగఁ గోసిరి శ్రీరామ చ. అడలి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ రేకు:0244-06 మాళవిగౌళ సంపుటము: 03-253 పల్లవి: ఏమని చెప్పగవచ్చు నీసంతోషవుసుద్ది నామము శ్రీకృష్ణుఁడట నారాయణునికి చ. జనని దేవకిదేవి జనకుఁడు వసుదేవుఁ డనఘుడైనయట్టి ఆదిమూర్తికి ఘనలోకరక్షణ కంసుమామ గండమును తనకుఁ గారణమట దైవశిఖామణికి చ. పుట్టినది మధుర పెంపుడుఁజోటు రేపల్లె వొట్టిన మాయల పురుషోత్తమునికి పట్టిన పాండవపక్షపాతము కౌరవవైరమిట్టి వ్రాఁతఫలమట యీశ్వరేశ్వరునికి చ. గోవులఁ గాచేదియు గొల్లెతలఁ బొందేదియు ఆవేళ గుణము యీ యచ్యుతునికి శ్రావణబహుళాష్టమి చంద్రోదయము రోహిణి కావింప జన్మమిదివో శ్రీవేంకటపతికి రేకు:0251-05 పూర్వగౌళ సంపుటము: 03-294 పల్లవి: ఏమని చెప్పీనో కాక యిలఁగల శాస్త్రాలు కామించి వాదించేవారి కడ మేదో చ. అంచెల జగములకు హరియే ఆధారము యొంచంగ నాధారము యితని కేదో పారించిన వేదార్ధముల పురుషార్థ మీతఁడు నించిన యర్ధము యీతనికి నేదో చ. పొందిన ప్రాణులకెల్లా పుట్టుగైనాఁడితఁడు యెందును తనకుఁ బుట్టుగిఁక నేడో చందపుఁ గర్మములకు సాధన మీదేవుఁడు మందలించ సాధనము మరి తనకేదో చ. కలయన్ని మాయలకుఁ గారణ మీ మూరితి తలపఁగ కారణము తనకేదో యెలమి శ్రీవేంకటేశుఁడితఁడే సర్వసాక్షి మలసి యీతని కిఁక మరి సాక్షి యేదో పె.అ.రేకు:0045-04 లలిత సంపుటము: 15-257