పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

382 రేకు:0344-04 గుజ్జరి సంపుటము:04-259 పల్లవి: ఏమన వచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు చ. కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి కలుషమెడలి సూర్యోదయమైనా కానవు కొన్ని జంతువులు తెలిసినవారలు కందురు యీ తెరఁగలు రెంటికి దినమొకటే చ. శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే చ. శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ మివోద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే శ్రీవైష్ణవులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే రేకు:0231-05 దేసాళం సంపుటము: 03–178 పల్లవి: ఏమనఁగ వచ్చునమ్మ ఇటువంటి వారిఁ జూచి కామించి గోపికలెల్లాఁ గాచుకున్నారదివో చ. రోలఁగట్టుపడ్డవాఁడు రోఁకలి పట్టినవాఁడు వేళలేదు వెన్నలెల్ల వెరఁజాడేరు వేలఁగొండెత్తినవాఁడు వేరే యేరుసేసేవాఁడు బాలులవలెనే వీధిఁ బారాడేరు వారివో చ. కాటుకమైచాయవాఁడు కప్పరపువన్నెవాఁడు కూటము గూడుక జోడుకోడెలైనారు నీటుఁ బైఁడికోకవాఁడు నీలికాశతోడివాఁడు తేటలై దూడలఁ గాచి తిరిగేరు వారివో చ. చేరి చీరలిచ్చువాఁడు చెలిఁ గుంగించినవాఁడు ధీరులై రేపల్లెలోనఁ దిరిగేరదే యీ రీతి శ్రీవేంకటాద్రి నిద్దరును నేకరూపై కోరినవారి వరాలు కొల్లలిచ్చే రదివో రేకు: 9028-02 సామంతం సంపుటము: 04-545 పల్లవి: ఏమనవచ్చును గొందరికింపౌఁ బులుసులుఁ దీపులు సామరితనమున నిన్నిటఁ జొరబీ నా తలఁపు చ. పదిలంబుగ సర్వాత్మక భావము దలఁచినపిమ్మట ముదమున నెవ్వరిఁ జూచిన మొక్కక పోరాదు వదలక యిన్నిటను శ్రీవల్లభుఁడున్నాఁడుండిన హృదయము చంచలమిన్నిట నెనయదు నామనసు చ. ఎక్కడఁ జూచినఁ బ్రాణులకిన్నియు నాచారములే చిక్కక యిన్నియుఁగైకొని చేయక పోరాదు మక్కువ నిన్నియు శ్రీ హరి మతములె కానీ అయినా ఒక్కటియే చాలును నాకొడఁబడవితరములు చ. ఏరీతులనటు చూచిన నిందరు బలుదైవములే కూలివిునందలినటువలెఁ గిరెలువకపాశీరాదు ధారుణి వేంకటపతిచేఁతలు ఇవియైనాఁగాని కోరిక నా కితఁడే మరి కొరకొరలిన్నియును రేకు: 0348-03 దేసి సంపుటము:04-281