పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

381 రేకు:0169-01 దేవగాంధారి సంపుటము:02-333 పల్లవి: ఏపొదూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ వీఁపు గానరాఁగా దాఁగే విద్య నీదిగాక చ. పుట్టిన మెకానకుఁ బూరి మేయ నేరిపిరా అట్టె పిల్లలఁ బెట్ట నటు నేర్పిరా చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా మట్టులేని దింతా నీమాయ యింతేకాక చ. తీవెలకుఁ జుట్టి చుట్టి దిక్కులఁ బాఁక నేరిపిరా తావులఁ దతికాలానఁ బూవ నేరిపిరా వేవేలు పక్కొమ్మలు వెసఁ బెట్ట నేరిపిరా యేవలఁ జూచినా నీమహిమ లింతేగాక చ. కోరి పక్షులు కొరులు గూండ్లువెట్ట నేరిపిరా సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా యిూరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన చేరి నీవు సేసిన సృష్టి యింతే కాక రేకు: 0301-05 వసంతవరాళి సంపుటము: 04-005 పల్లవి: ఏమందు మిందుకు నెఱిఁగినదే తొల్లి శ్రీమాధవుఁడ నీవు సేసినదే తొల్లి చ. వొక మానఁ జేఁదూ వొక మానఁ దీపూ కకిపికలై రెండూ గలవే తొల్లి వొకనికజనము వొకనికి జ్ఞానము సకలానఁ గలుగుట సహజమే తొల్లి చ. పగలు వెలుఁగు పైపై రాత్రి చీఁకటి నిగిడి లోకములను నిజమే తొల్లి మొగి సురలకు మేలు ముంచి దైత్యులకుఁ గీడు తగిలి నోసలివ్రాఁత తప్పదిది తొల్లి చ. వెన్నెలలు చంద్రునందు వెడ యొండ సూర్యునందు కన్నుల లోకమువారు గన్నదే తొల్లి యెన్నఁగ శ్రీవేంకటేశ యేలినవాఁడవు నీవు వున్నవారు నీకింద నున్నవారు తొల్లి రేకు:0106-06 వరాళి సంపుటము:02-036 పల్లవి: ఏమందురు యీ మాటకు నిందరూ నిన్ను నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా చ. నేను నిన్నుఁ గొలిచితిని నీవు నన్ను నేలితివి పాని పంచేంద్రియాలేల పనిగొనీని కానిలేని బంట్లఁ దేరకాండ్లు వెట్టిగొనఁగ దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా చ. పుట్టించినాఁడవు నీవు పుట్టినవాఁడను నేను పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాఁచితే తట్టి నీవు వహించుకోఁదగదా సర్వేశ్వరా చ. యెదుట నీవు గలవు యిహములో నేఁ గలను చెదరిన చిత్తమేల చిమ్మిరేఁచీని అదన శ్రీవేంకటేశ అరితేరినట్టినన్ను వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా