పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

380 రేకు:0070-01 ఆహిరి సంపుటము: 01-364 పల్లవి: ఏపనులు సేసినా నిటువలెనేపాళీ యీపనికిఁ జొరనిపని యేటిలో పైరు చ. హరికథలమీఁదిప్రియమబ్బు నా తొంటితమ. పరిపక్వమగుఁ దప:ఫలముగాక గరిమె నివిలేకున్నఁ గలకాలములుఁ జేయు నిరతంపుఁదపమెల్ల నీటిలో వ్రాత్ర చ. నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్లఁ బారఁజల్లిన దానఫల మదియపో కోరి యివి లేకున్న కోటిదానములైన పేరుకొని వరతఁగలపినచింతపండు చ. వదల కిటు వేంకటేశ్వరుఁడే దైవంబనుచుఁ జదువఁగలిగిన మంచి చదు వదియపాశీ పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను చదువు లసురలు మున్ను చదివేటిచదువు రేకు:0244-01 భైరవి సంపుటము: 03-248 పల్లవి: ఏపాటి గలవాఁడ నిదివో నేను నాపాటు చూచి హరి నన్నుఁ గావఁగదవే చ. నిలువు నూరు వండీని(?) నిచ్చలు నీదేహమైతే వొలిసీ దుఃఖములకు నోరువ లేదు కులము గోటిసేసును గుంపుల జన్మాదులైతే అలరి వొరులఁబోయి అడిగేదే యెపుడు చ. పట్టితే పసిఁడి రాలీ బచ్చన సంసారము గుట్టుదెలియఁ బ్రాణము కూటిచేతిది వుట్టిపడీ మానుషము వొకనాటి కొకనాఁడు పట్టికాంతలయెదుట భంగపడే మిదివో చ. చేరి చెట్టడిచితేను చేటఁడు చుట్టరికాలు యీరీతి నిన్నాళ్లదాఁకా నెందుండిరో ఆరిచితే మూరెఁడెక్కీనదే నామకీర్తనము కూరిమి శ్రీవేంకటేశ కొన నాలికెకును పె.అ.రేకు:0069-04 మధ్యవవతిసంపుటము: 15-397 పల్లవి: ఏపాటివారికి నాపాటివాఁడవు చేపట్టినవారిని చేకొని రక్షింతువు చ. విన్నపములు సేయువారి విన్నపములు విందువు సన్నుతించే వారిని సార మెంతువు కన్నులఁ జూచేవారిఁ గడఁగి నీవు చూతువు వున్నవారి కెల్లా నీవు వూరకే వుందువు చ. కొలిచినవారల కొలువు లీడేరింతువు తలఁచినవారల దండ నుందువు వలసినవారికి వరము లొసఁగుదువు తెలియనివారల తెరువు నీ వొల్లవు చ. శరణు చొచ్చినవారి సరవితోఁ గాతువు సరుగ నీ వారికిఁ జన విత్తువు యిరవై యలమేల్మంగ నేలిన శ్రీవేంకటేశ మడుగనివారికి మట్టుతో నుండుదువు