పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

379 కొంత దాఁచనేల శ్రీ గురుఁడే సాధనము రేకు: 0382-03 లలిత సంపుటము:04-478 పల్లవి: ఏదైనా సుఖమే యిన్నిటా నీవు గలవు కాదుగూడదని నిన్నుఁగక్కసించనేఁటికి చ. యిహపరములలో నీ వెందు నన్నుఁ బెట్టినాను నిహితమై రెంటిలోనా నీవు గలవు వహి కెక్క నేలినవాఁడెక్కడ నుండుమన్నా తహతహఁ గొలువుకుత్తరువే బంటుకుమ చ. పాప పుణ్యములలో నేపని నన్నుఁ జేయించినా కాపాడి రెండు నీవు కల్పించినవే యేపున మగఁడైన వాఁ డేమి సేయించినాను దాపగుఁ బతివ్రతా ధర్మమే యాలికిని చ. కల్ల నిజములలో నొక్కటి నన్ను నాడించినా చెల్లించ రెంటికి నీవే శ్రీ వేంకటేశా తల్లిదండ్రులే బాస దగ నాడ నేర్పినాను తెల్లమిగ నాడేది తేకువే బిడ్డనికి రేకు:0016-06 గీతం - నాట సంపుటము:01-100 పల్లవి: ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ త్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను యేదైవమునాభి నలినంబున జనియించిన అజుండు అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను చ. యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిర మాతయయ్యే యీజగంబుల కెల్లను యేదైవము అవలోకన మింద్రాదిది విజగణంబుల కెల్లప్పుడును సుఖంబు లాపాదించును చ. యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడి శ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురు ఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకటగిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు రేకు: 0318-01 గుండక్రియ సంపుటము: 04-102 పల్లవి: ఏపను లెవ్వరికిఁగల దెంత యంతేకాని శ్రీపతియాణాజ్ఞలు మీఁఅగ చింతింపఁగఁ దరమా చ. సులభంబున సుఖియుంచుట(బోలదు సాంపుగ భిక్షాన్నముతోడ పలు లంపటములఁబడి ఘడియించేటి బహుధన మిగదియేల తొలుతే జంతువులను వ్రాసెను తొడఁగి నుదిట బ్రహ్మ కలది దైవికములఁ గడచెదమని కడుబడలెదరేలో నరులు చ. పాపము సేయక మానుటఁ బోలదు పరమశాంతితోను కోపము మానక బహుపుణ్యంబులు కోట్లు చేసినను దీపింపఁగ వేదశాస్త్రములు తెలిపెడియర్థ మిదే కైపుగ నిది దెలియక జీవులు కడుబడలెదరేలో నరులు చ. సహజము జగమున యీ పనులెల్లను జరగుచు నుండుట స్వభావము గహనము ప్రాణులకే పనులను ననఁ గాదన కర్తన్య మింతేది యిహమేల శ్రీవేంకటేశ్వరు నమ్మిన యీతనిశరణాగతులు మహిలోఁజూతురు నవ్వదు రిటునలె మానరేటికో నరులు