పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

378 వింతల బొరలిన నరకకూపముల వెనకటి దైన్యములటు చూడు సంతసమున ముందరిమోక్షము సర్వానందంబది చూడు రేకు: 0356-03 వరాళి సంపుటము:04-329 పల్లవి: ఏదియుఁగానఁడు నేది గాదందు ఆదిపురుష నీదాస్యమే చాలనాకు చ. గరిమఁ గొందరికి సాకారమై నిలిచితి గురునిరాకారమై కొందరికి సరుసఁ గొందరికెల్లా సగుణుఁడవట నీవు ధర నిరుణమవట త్రగిలి కొరిందలకి చ. వొకటఁ గళాపూర్తి నొనరియుందువట వొకట నిష్కళుఁడవై వుడివోవట వొకచో జీవుల నీకొరయ భేదమట వొకచో నె భేదమట వున్నారట నీకు చ. అదన నిందరిలోన నంతరాత్ముఁడవట యెదుట శ్రీవేంకటేశుఁడవట యిదియిది యననేల యింతయును నీ మహిమ కదిసి నీ పాదాలే కనుఁగొంటగాక రేకు: 0049-04 నాట సంపుటము: 01-301 పల్లవి: ఏదియునులేని దేఁటిజన్మము వేదాంతవిద్యావివేకి గావలెను చ. పరమమూర్తిధ్యానపరుఁడు గావలె నొండె పరమానందసంపద లోరెందవలెను పరమార్థముగ నాత్మభావింపవలె నొండె పరమే తానై పరగుండవలెను చ. వేదశాస్తార్థకోవిదుఁడు గావలె నొండె వేదాంతవిదుల సేవించవలెను కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె మోదమున హరిభక్తి మొగి నుండవలెను చ. సత్రతభూదదయూవిచాలి గావలె నొరిండె జితమైనయింద్రియస్థిరుఁడు గావలెను అతిశయంబగు వేంకటాద్రీశు సేవకులె గతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను రేకు: 0364-03 దేవగాంధారి సంపుటము:04-377 పల్లవి: ఏదైన దేవుఁడు ప్రాణికియ్యక లేదు పాదుగ నాతనిమీఁది భక్లే సాధనము చ. దేహమునకు ఫలము తెగని యాలుబిడ్డలు దేహాంతరాత్మకును దేవుఁడొకఁడే ఫలము దేహమే బంధకము దేవుఁడింతే మోక్షము వూహల రెంటికి మనసాక్కటే సాధనము చ. పుట్టినందుకు ఫలము పొందగు భోగములే పుట్టుగే గెలుచుటకు భువి జ్ఞానమే ఫలము పుట్టుటకు గర్మము పోవుటే యకర్మము వెట్టే యిూ రెంటికిని విరతే సాధనము చ. చింతించుటకు ఫలము సిరులెల్లఁ జేకొనుటె చింత వీడుటకు ఫలము శ్రీ వేంకటేశు సేవే చింతలే దుఃఖములు నిశ్చింతములే సుఖములు