పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

377 శ్రీవేంకటగిరిఁ జెలఁగిన నీవే తావుగ మదిలోఁ దగిలితివి రేకు: 0326-06 సామంతం సంపుటము: 04-153 పల్లవి: ఏది మాకు గతియిక నీశ్వరేశ్వరా యీదెస మము గరుణ నీడేర్చవయ్యా చ. పాంచిమన్ను భోగించిన భోగములు దలఁచి అంచెల నాలుబిడ్డల నటు దలఁచి కంచపుటాహరములు కన్నవెల్లాను దలఁచి యెంచి నిన్నుఁ దలఁచక యిటున్నారమయ్యా చ. కన్నులఁజూచినందెల్లా కడునాసలఁ దగిలి విన్న వినుకులకెల్లా వేడ్కఁదగిలి పన్నిన సుఖములకుఁ బైకొని వెనుతగిలి వున్నతి నిన్నుఁ దగులుకున్నారమయ్యా చ. చెంది గృహారామ క్షేత్రములు మరిగి పొందగు సంసారమిప్పుడు మరిగి అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి కందువ మరిగీ మరుగకున్నారమయ్యా పె.అ.రేకు:0009-06 శుద్ధవసంతం సంపుటము: 15-055 పల్లవి: ఏది యిందులో సుఖ మెవ్వరు మంచివారలు పాదు దెలియని ప్రాణిభ్రమ యింతే కాక చ. భోగింపుచు పిండి పిండి పూచి రక్తమాంసము లాగతిఁ బుత్రదారాదు లలయింతురు చేగదేర వెట్టిగొనే చేతుల యిడుమలెల్ల సాగిన సభలలోన సంసారము చ. వుఱక మేనిలోఁ జొచ్చి వొగి నింద్రియాల కేఁచి అఱమఱపించఁ జచ్చె నన్నపానములు యెఱిఁగెఱిఁగియుండగా నేలినవాని కమ్మించె తఱిఁ దనజన్మ మెల్ల ధనధాన్యములు చ. వొప్పి గుఱిగాక వూరకున్నవాని నతిథుల కప్పన మప్పించెను గృహారామములు యిప్పుడే శ్రీవేంకటేశుఁ డేలి మమ్ముఁ గాచెఁ గాక పుప్పిగాఁ దినె నిన్నాళ్ళు పుణ్యపాపములు రేకు: 0132-02 బౌళి సంపుటము: 02-128 పల్లవి: ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ పాదగు మనలో నంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను చ. మనవంటి జీవులే మహిలోన నొక కొన్ని శునకములై కుక్కుటములై సూకరములు నైనవి దినదినముఁ గర్మపాశములఁ దిరిగెడి దుర్దశ లటుచూడు సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటుచూడు చ. కన్నులుఁ గాళ్ళు మనవలెఁ దనువులు గైకొని కొందరు నరులు పన్నిన తొత్తులు బంట్లనై మనపనులు సేయుచునున్నారు యెన్నఁగ శ్రీహరి నెఱఁగక యిడుములఁ బొరలెడి దది చూడు మున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు చ. యింతగాలమును యీపుట్టుగులనె యిటువలెఁ బొరలితి మిన్నాళ్ళు యింతట శ్రీవేంకటేశుఁడు దలంచి యీ జన్మంబున మము నేలె