పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

376 అOత్రయు ననరుహమును నరుపూOబన (గరాదు అంతవానికిఁ బరుల కలవడదుగాన రేకు:0016-01 శ్రీరాగం సంపుటము: 01-095 పల్లవి: ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె వేదు.విడిచిన కూడు వెదకినను లేదు చ. ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి కైకొన్నదురితములు కలపాటిగాక చ. హితవైనమమకార మెందుఁగల దిందరికి ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు జితమైన దైవమిచ్చిన పాటిగాక చ. యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకు పరిమైనకర్మంబు పరిపాటిగాక యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ దిరువేంకటేశుకృప తిరమైనఁగాఁక రేకు:0017-02 బౌళి సంపుటము: 01-102 పల్లవి: ఏది తుద దీనికేది మొదలు పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి చ. ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు యెన్ని వేదనలు మరియొన్ని దుఃఖములు యెన్ని పరితాపంబు లెన్నిదలపాఁతలు యెన్ని చూచిన మరియు నెన్నెనఁ గలవు చ. యెన్ని కొలువులు దనకు నెన్స్ యనుచరణలు యెన్ని యూసలు మరియు నెన్ని మోహములు యెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి ఇన్నియునుఁ దలఁప మరి యెన్నెనఁ గలవు చ. యెన్నిటికిఁ జింతించు నెన్నిటికీ హర్పించు నెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగు యిన్నియును దిరు వేంకటేశులీలలు గాఁగ_ నెన్ని చూచినను దా నెవ్వఁడునుగాఁడు రేకు:0201-02 బౌళి సంపుటము: 03-002 పల్లవి: ఏది నిజంబని యెటువలె నమ్ముదు పాశీదితోడ నను బోధింపవే చ. సత్తు నసత్తని సర్వము నీవని చిత్తగించి శ్రుతి చెప్పెడిని వుత్తమమధ్యమ మొగిఁ గలదని మరి యిత్తల శాస్త్రము లేర్పరచీని చ. నానారూపులు నరహరి నీవని పూనిన విధు లిటు పారెగడెడిని మానక హేయము మరి వుపాధే(దే?)యము కానవచ్చి యిలఁ గలిగియున్నవి చ. భావాభావము పరమము నీ వని దైవజ్ఞలు నినుఁ దలఁచెదరు