పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

375 కదిసి వేంకటపతిఁ గనుట యెన్నఁడు తుదలేనిభవములఁ దొలఁగు టెన్నఁడు రేకు: 0.162-04 సామంతం సంపుటము: 02-300 పల్లవి: ఏది గతి నే నొక్కఁడనే యెందరి కోపుదును నీదయతో మన్నించంగదవే నీరజనాభా చ. మోహాంధకారము యొక్కడ చూచిన ముంచుకవున్నది దేహాభిమానము అందుకుఁ దోడు దీకొనివచ్చీని సాహసభూతము ఘనహింసలకే చాంపించీఁ జేయి దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని చ. కోపాగ్నికణములు సారెకుఁ జుట్టుక గుబ్బతిలఁ దొడఁగె పైపై వయోవికారంబులు చలపట్టుక ෂිවරීඞ చాపల గర్వము యెవ్వరినైన సాధింపించీని తీపుల ధనములు మీఁదిమీఁదనే తీదీపులు రేఁచీని చ. భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని వేవేలు సంపద లెందుచూచినా వేడుక సేసీని శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొను దేవుఁడా యీవేళను నన్నేలితివి నిన్నియు తగ వసమయిన్యాని రేకు:0023-04 శ్రీరాగం సంపుటము: 01-140 పల్లవి: ఏది చూచిననుఁ గడు నిటువంటి సోద్యములే మేదినికిఁగిందుపడి మిన్నందనేలా చ. కరిరాజుగాంచినకరుణానిధివి నీవు అరిది నరసింహరూపైతివేలా వురగేంద్రశయనమున నుండి నీవును సదా గరుడవాహనుఁడవై గమనించనేలా చ. పురుషోత్తముఖ్యాతిఁ బొదలి యమృతము వంప తరుణివై వుండ నిటు దైన్యమేలా శరణాగతులకు రక్షకుఁడవై పాము నీ_ చరణములకిందైన చలముకొననేలా చ. దేవతాధివుఁడవై దీపించి యింద్రునకు భావింప తమ్ముఁడనఁ బరగితేలా శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల_ జీవకోట్ల లోనఁ జిక్కువడనేలా రేకు:0009-05 సామంతం సంపుటము: 01-060 పల్లవి: ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే వేదవిరహితులకు వెఱతు మటుగాన చ. ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁ బలికించవలెఁగాని భజియింపరాదు గరిమ చెడి సత్సమాగంబు విడిచిన నీ_ స్మరణ విజ్ఞానవాసన గాదుగాన చ. యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు సహజమనవలెఁగాని సలిఁ గొరిలువరాదు అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు గ్రహియింపరా దవగ్రాహములు గాన చ. యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁ జింతింపవలెఁగాని సేవింపరాదు