పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

374 భావగోచరమైన పరిణతది యెట్లుండు కైవల్యసౌఖ్య సంగతులు నటుండు రేకు:0312-02 లలిత సంపుటము:04-068 పల్లవి: ఏతపములు నేల యేదానములు నేల శ్రీతరుణీపతినిత్యసేవే జన్మఫలము చ. దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే దేహముతోనే తాను దేవుఁడౌట సాహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట చ. వెలి నిటూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే కులికి తపోధనము గూడపెట్టుట తలఁపు తనందే తగ లయము సేయుట లలిఁ బాపబంధముల లయము సేయుట చ. వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే మునుపనే తా జీవన్ముక్తుఁడౌట పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే అనువైన దివ్యపదమప్పుడే తా నందుట రేకు: 0345-03 లలిత సంపుటము:04-264 పల్లవి: ఏదాయ నేమి హరి యిచ్చినజన్మమే చాలు ఆదినారాయణుఁడీ యఖ9లరక్షకుడు చ. శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని తన కది హీనమని తలఁచుకోదు మనసాడఁబడితేను మంచిదేమి కానిదేమి తనువులో నంతరాత్మ దైవమయోట దప్పదు చ. పురువుకుండేనెలవు భవనేశ్వరమై తోఁచు పెరచోటి గుంతయైన ప్రియమైయుండు యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి వరుస లోకములు "సర్వం విష్ణుమయ"ము చ. అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే చెచ్చెరఁ దనతిమ్మటే జీవన్ముక్తి కచ్చుపట్టి శ్రీ వేంకటపతిదాసుఁడైతే హెచ్చుకుందేమిలేదు యేలినవాఁడితఁడే రేకు: 0036-06 కన్నడగౌళ సంపుటము: 01-225 పల్లవి: ఏది కడ దీని కేది మొదలు | వట్టి. వేదనలు తన్ను విడుచు టెన్నఁడు చ. తొడరినహృదయమే తోడిదొంగయై వడిగొని తన్ను వలఁబెట్టఁగాను కడఁగి కర్మములఁ గడచు టెన్నడు నిడినిబంధముల నీఁగుటెన్నఁడు చ. తతిగొన్న తలఁపులే దైవయోగమై మతినుండి తన్ను మరిగించఁగాను ప్రతిలేని యాపదం బాయు టెన్నఁడు ధృతిమాలిన యాస దీరు టెన్నఁడు చ. పొదలిన మమతయే భూతమై తన్నుఁ బొదిగొని బుద్ధి బోధించఁగాను