పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

373 యీతల శ్రీవేంకటాద్రి నిటు విజనగరాన నీతితో నెలవుకొని నెగడితివి రేకు:0131-04 గౌళ సంపుటము: 02-124 పల్లవి: ఏడనుందురో తాము యెన్నికెపౌఁజులు దాఁటి రాడకాడే పాండచూపే రాహా మేలు చ. యెలమి స్వప్నమనే యెడపుఁ జావడిలో వొలసి జీవుఁడు కొలువున్నపుడు వెలినున్న చైతన్యవిధుల దొరలచేతియలబలము గాన మాహా మేలు చ. ఉప్పడమయి దేహమనే వూరఁ బెద్దచావడి ఉప్పతిల్లి దేహి కొలువున్నపుడు చప్పుడుతో నింద్రియవిషయపరివారము అప్పుడు పారాడుదురు ఆహా మేలు చ. అక్కడ నిదురలనే అంతఃపురాల కేగి వుక్కున భోగాన నాత్మ వున్నపుడు యొక్కువ శ్రీవేంకటేశ యెవ్వరూ నాడకుఁ బోరు అక్కడా నీవే వుందు వాహా మేలు రేకు:0256-06 పాడి సంపుటము: 03-325 పల్లవి: ఏడే జేనలు యీదేహంబును యేడా నిఁకమరి యెరఁగము నేము చ. నిండును జలధులు నిమిషమాత్రమున నిండియు నిండదు నెఱి మనసు పండును భువిఁగల పంటలన్నియును పండదు నాలోఁ బాపపు మనసు చ. పట్టవచ్చునల పారేటి పామును పట్టరాదు నాపాయము అట్టే ఆరును అనలము నీటను ಯೆನ್ಜಿನಿ నారదు యినా కోపంబు చ. కానవచ్చు నదె ఘనపాతాళము కానరాదు నాకాలము శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర సోనలఁ బుట్టిన సుద్దులు నిg్చగో రేకు:0016-05 నారణి సంపుటము: 01-099 పల్లవి: ఏణ నయనల చూపులెంత సాబరైయుండు ప్రాణ సంకటములగు పనులు నటుండు చ. ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు అడియూస కోరికలు నటువలెనె యుండు కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు అడరు సంసారంబు నట్లనే వుండు చ. చింతా పరంపరలఁ జిత్తమిది యెటుండు వంతఁ దొలఁగన మోహవశము నటుండు మంతనపుఁ బనులపయు మనసు మరియెటుండు కంతుశరమార్గముల గతి యట్లనుండు చ. దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు శ్రీవేంకటేశు కృపచేత లటుండు