పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

371 యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా నెప్పున నేఁ జేసినట్టి నేరమెల్లా నడఁగె రేకు: 0353-04 లలితసంపుటము: 04-312 పల్లవి: ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము భోగపుఁగోరికలచేఁ బొలిసెఁ బో పతులు చ. పరగి నాలుకసారింపు పరసిపాశీయ పరులనే నుతియించి పలుమారును విరసపుఁబాపములవినికిచే వీనులెల్లాఁ గొరమాలె మాకు నేఁటి కులాచారము చ. మొక్కలాన పరధనమునకుఁ జాఁచిచాఁచి ఎక్కువఁజేతులమహి మెందో పోయ తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ధి ముక్కపోయ మాకు నేఁటి ముందటిపుణ్యాలు చ. యెప్పుడు నీచులయిండ్లకెడతాఁకి పాదములు తప్పనితపములెల్లఁ దలఁగిపోయె యిప్పుడె శ్రీవేంకటేశ యిటునిన్నుఁ గొలువఁగా నెప్పున నేఁజేసినట్టి నేరమెల్లా నణఁగె రేకు:0235-01 సామంతం సంపుటము: 03-198 పల్లవి: ఏడ ధర్మ మేడ కర్మ మిన్నియు నీ సేవేకాక యీడనే యిందుకు సాక్షి ఇట్టే నిలిపితివి చ. తెగువసేసి నీకుఁ దెచ్చిరి బోనములు మగండ్లమాటదోసి మౌనిసతులు తగ నిన్నుఁ జేపట్టుటే ధర్మముగా నిలిపి జగ మెరఁగఁగ వేదసమ్మతి సేసితివి చ. బల్లిదాన నిన్నుఁ బొందే బలుసాహసము సేసి తల్లిదండ్రిమాట దోసి తానే రుక్మిణి యెల్లగా నీకు మోహించు టెక్కుడుతగవు సేసి వెల్లవిరి నాపె నీవు వీధుల నేఁగితివి చ. శ్రీవేంకటేశ నిన్ను సేవించవచ్చితేఁ జాలు భావించి రక్షింతువు నీపరుషలను యీవల నీకు మొక్కుటే యిన్ని పుణ్యములూ జేసి(?) కావించి హీనుల మమ్ము ఘనులఁ జేసితివి రేకు:0223-04 కాంబోది సంపుటము: 03-129 పల్లవి: ఏడ పెద్దల మెట్టెతిమో మరి తోడనే నవ్వేము దొరకొని మమ్మును చ. పంచేంద్రియములఁ బట్టగ లేమట యొంచంగ వివేక మొన్నటికి అంచెల మమతల నణఁచఁగలేమట పొంచిన బుద్దులు భువి నెన్నటికి చ. వెడవెడ నాసలు విడువఁగ లేమట యెడయని ధైర్యం బెన్నటికి తొడుసగు బంధముఁ దుంచఁగ లేమట బెడిదపు తనలో బిరుదెన్నటికి చ. కామక్రోధములఁ గడవఁగ లేమట యిూమానుషములు యెన్నటికి