పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

370 చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటిలోకపు మునులనుఁ దెలుసుకోవలదా పె.అ.రేకు:0064-01 పాడి సంపుటము: 15-364 పల్లవి: ఏకాలము నామనే యెఱిఁగిన దాసులకు దాకొనీ శ్రీహరిభక్తి దారణ గలిగితేను చ. వుడివొడేకాలము వొక్క తతి రావద్దు చెడని శ్రీహరిభక్తిచెట్టుకట్టితే తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లు వోదు బడినే శ్రీహరిభక్తి పంట వండితేను చ. వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్లి గాదు కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే యెలుకకు దినరాదు యెన్నాళ్ళున్నా జివుకదు తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే చ. కఱవుకు లోఁ గాదు సుంకరవానికి నబ్బదు యెఱుకతో హరిభక్తి యిలు నిండితే నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను రేకు:0240-04 పాడి సంపుటము: 03-230 పల్లవి: ఏకాలము నామనే(???) యెరిఁగిన దాసులకు దాకొని శ్రీహరి భక్తిధారణ గలిగితేను చ. తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లువోదు బడినే శ్రీహరిభక్తి పంట పండితే వుడివోదేకాలము వొకతతి రావద్దు (?) చెడని శ్రీహరిభక్తి చెట్టుకట్టితేను చ. వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్లి గాదు కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే యెలుకకుఁ దినరాదు యెన్నాళ్లున్నాఁ జివుకదు తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే చ. కఱవుకుఁ లోఁగాదు సుంకరవాని కబ్బదు యెఱుకతో హరిభక్తి యిలు నిండితే నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను రేకు:0111-01 లలిత సంపుటము:02-061 పల్లవి: ఏగతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము భోగపుఁ గోలికలచే బొలిసెఁబో పనులు చ. పరగి నాలుకసారింపు పరసిపాశీయ పరులనే నుతియించి పలుమారును విరసపుఁ బాపముల వినికిచే వీనులెల్లాఁ గొరమాలె మాకు నేఁటి కులాచారములు చ. మొక్కలానఁ బరధనమునకుఁ జాఁచి చాఁచి యొక్కువఁ జేతుల మహిమెందో పోయ తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ది ముక్కపోయ మాకు నేఁటిముందరి పుణ్యములు చ. యెప్పుడు నీచుల ఇండ్ల కెడతాఁకి పాదములు తప్పని తపములెల్లాఁ దలఁగిపోయ