పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

369 విరసవర్తన చీచీ వీడెఁగా మీభారము రేకు:0112-01 శ్రీరాగం సంపుటము:02-067 పల్లవి: ఏఁటిమాట లివి విన నింపయ్యినా మదినేఁటవెట్టి దాసుఁడౌ టిదిసరియా చ. జీవుఁడే దేవుఁడని చెప్పదురు గొందరు దైవముచేఁతలెల్లాఁ దమ కున్నవా ఆవలఁ గొందరు కర్మ మది బ్రహ్మ మందురు రావణాదు లవి సేసి రతికెక్కిరా చ. మిగులఁ గొందర దైవమే లేదనెందురు తగ నీప్రపంచమెల్లాఁ దనచేఁతలా గగన మత్రఁడు నిరాకార మందురు గోరింద రెగువఁ బురుషసూక్త మొఱఁగరా తాము చ. యెనిమిది గుణములే యితని వందురు గొంద రనయము మిగిలిన వవిదమవా యెనయంగ శ్రీవేంకటేశ్వరుదాసులై మనుట నిత్యముగాక మరి యేమినేలా రేకు:0022-05 కాంబోది సంపుటము: 01-135 పల్లవి: ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక మాటమాత్రమున నటమటమైన సుఖము చ. కొనసాగుదురితములె కూడైన సుఖము తనువిచారములలో దాకొన్న సుఖము పనిలేనియాసలకుఁ బట్టయిన సుఖము వెనుకముందరం జూడ వెరడైన సుఖము చ. నిందలకులోనైన నీరసపు సుఖము బొందికిని లంచంబుపుణికేటి సుఖము కిందుపడి పరులముంగిలి గాచుసుఖము పందివలె తను(దానె బ్రదికేటి సుఖము చ. ధృతిమాలి యిందరికి దీనుఁగడు సుఖము మతిమూలి భంగములు మఱపించు సుఖము పతివేంకటేశుకృప పడసినది సుఖము యితరంబులన్నియును నీపాటి సుఖము రేకు: 0154-02 శంకరాభరణం సంపుటము: 02-253 పల్లవి: ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము మీకు లోకవిరోధ మేమిటం బాసీనయ్యలాల చ. పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా చ. వొకఁ డపవిత్రుఁడైతే నొగి నిందరుఁ గావలదా వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా వోరెకని రత్రిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా చ. ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా